Ram Charan will Attend to Ambani Wedding: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కొణిదెల ముంబైకి వెళ్లారు. తమ గారాల పట్టి క్లింకారతో కలిసి ముంబై బయలుదేరిన ఎయిర్‌పోర్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారు ముంబైకి ఎందుకు వెళ్లారో తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా చంకలు గుద్దుకుంటున్నారు. ఇంతకి చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్లారంటే.. అంబానీ వివాహమహోత్సవానికి. ప్రస్తుతం భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు రేపు జూలై 12న ఏడడుగులు వేయబోతున్నారు.
ఈ సందర్భంగా అంబానీ ఇంటికి సినీ,రాజకీయ ప్రముఖులంతా అంబానీ నివాసానికి వెళుతున్నారు. అనంత్-రాధిక వివాహ వేడుకకు ఇండియన్ సినీ, రాజకీయ సెలబ్రిటీలకు ఆహ్వానం పంపారు. అంబానీ నుంచి టాలీవుడ్‌కు చెందిన ఒక్క రామ్ చరణ్, కుటుంబానికి మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చరణ్ కుటుంబ సమేతంగా అంబాని ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పయనమయ్యాడు. రేపు జరిగే అనంత్-రాధికల పెళ్లికి చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో ఇవాళ(జూలై 11) ఉదయం బయలుదేరగా.. తాజాగా ముంబైలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఇక అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకలకు రామ్ చరణ్-ఉపాసనలు పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీ చెందిన సెలబ్రిటిల్లో చరణ్‌కి మాత్రమే అంబాని నుంచి ఆహ్వానం అందింది. ఇప్పుడు పెళ్లికి కూడా ఒక్క చరణ్ కుటుంబానికి మాత్రమే ఆహ్వానం అందడం గమనార్హం. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న అనంత్ – రాధికా పెళ్లి వేడుకలకు ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలంతా పాల్గొని సందడి చేస్తున్నారు. టిమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ ధోని, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ, సల్మాన్ ఖాన్ ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలంతా అనంత్-రాధికల పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార అవార్డు గెలిచిన అనంతరం రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు వరల్డ్ వైడ్‌గా మారుమోగాయి.
ఆస్కార్ తర్వాత చరణ్ బాలీవుడ్‌లో జరిగే పలు ఈవెంట్స్, మీడియా కాన్ఫిరెన్స్‌లకు హాజరై నార్త్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. గత జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ అంబానీ కూడా చరణ్ కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు రామ్ చరణ్ ఆహ్వానం అందడం పట్ల మెగా ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. కాగా చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా చరణ్ తన షూటింగ్ పార్ట్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. ఇక త్వరలోనే బుచ్చిబాబు RC16 చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని సమాచారం.