అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), కృతి శెట్టి (Krithi Shetty)ది సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు. అందులో 'బంగార... బంగార...' సాంగ్ కూడా సూపర్ హిట్. ఈ జోడీ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ జోడీ రిపీట్ అవుతోంది. మరో సినిమాలో ఈ జంట సందడి చేయనుంది.
 
నాగ చైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.

Continues below advertisement


అక్కినేని నాగ చైతన్యతో మాత్రమే కాదు... మూవీ ప్రొడక్షన్ హౌస్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్‌లోనూ కృతి శెట్టికి ఇది రెండో సినిమా. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్'లోనూ ఆమె కథానాయిక.


Also Read : మెడలో మంగళ సూత్రంతోనే నయన్ - హ‌నీమూన్‌లోనూ ట్రెడిషనల్‌గా






నాగ చైతన్యకు ఇది 22వ సినిమా. అందుకని, NC22గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఎంపిక విషయాన్ని వెల్లడించారు. 


Also Read : షారుఖ్ ఖాన్ కోసం అతిథిగా మారిన రానా దగ్గుబాటి?