'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్‌.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్'(Pakka Commercial) అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. ఇందులో గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. గోపీచంద్ ను చాలా స్టైలిష్ గా ప్రెజంట్ చేస్తున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు న‌టించిన ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. 


Also Read: ఛార్మితో రిలేషన్, భార్యకు పూరి విడాకులు - ఆకాష్ పూరి ఏమన్నారంటే?


Also Read: పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిన చైతు - మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో!