ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మీ జీవితంలో మీరు వద్దనుకునే ఘటనలు మీ మెదడులో నుంచి శాశ్వతంగా చెరిగిపోతే?? అసలు, ఆ విషయం జరిగిందనేది కూడా మీకు గుర్తుండకపోతే??? చాలా హ్యాపీగా బతికేయొచ్చు అనుకుంటున్నారు కదా! సరిగ్గా ఇలాంటి మైండ్ బెండిగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే 'ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్'.


"How happy is the blameless vestal's lot! The world forgetting, by the world forgot. Eternal sunshine of the spotless mind! Each prayer accepted, and each wish resigned" - ప్రపంచ ప్రఖ్యాత కవి అలెగ్జాండర్ పోప్ 1717లో రాసిన ఓ కొటేషన్... దానిలోని భావమే 2004లో వచ్చిన ఈ 'ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్'  కథకు మూలం.


ఈ సినిమా ప్లాట్ గురించి మాట్లాడుకుంటే... 
ఏవో అపార్థాల కారణంగా... తమ బ్రెయిన్ లో ఉన్న ప్రేమ తాలూకూ జ్ఞాపకాలను మెమరీ ఏరేషర్ ద్వారా హీరో హీరోయిన్లు తొలగించుకుంటారు. ఈ కథకు బేస్ లైన్ ఇదే. కానీ ఐరనీ ఏంటంటే... మెమరీ ఎరేషన్ చేయించుకున్న తర్వాత ప్రతిసారీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు. మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ కదా! రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ లాంటి జానర్లన్నీ కలిపి తీసినట్లు ఉంటుంది ఎటర్నల్ సన్ షైన్.


ఓ వైపు జ్ఞాపకాలు గతించి పోతుంటే... తమ ప్రేమను కాపాడుకునేందుకు వాళ్లు ఏం చేశారనే నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ ను స్క్రీన్ రైటర్స్ చార్లీ కఫ్మెన్, లూయిస్ డంకన్ అంతే అందంగా రాశారు. చాలా టిపికల్ టాపిక్ ని లాజిక్ మిస్ కాకుండా మైఖేల్ గోండ్రి అద్భుతంగా డైరెక్ట్ చేయగా హీరో జోయెల్ పాత్రలో జిమ్ క్యారీ, హీరోయిన్  క్లెమెంటైన్ పాత్రలో కేట్ విన్స్లెట్ అద్భుత అభినయాన్ని చూసి తీరాల్సిందే. సినిమాను మరింత అర్థం చేసుకోవడం కోసం ఓ స్పాయిలర్ చెప్పక తప్పదు... ప్లీజ్ డోంట్ మైండ్! మెమరీ ఎరేషన్ చేయించుకున్నప్పుడల్లా... హీరోయిన్ హెయిర్ కలర్ మార్చుకుంటుంది. సో తన హెయిర్ కలర్ బట్టి జరుగుతున్న కథ మళ్లీ మొదలైందని అర్థం చేసుకోండి. అంటే ప్రతీసారి ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ అన్నమాట.


సినిమా ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటే...
మన జీవితం ఒక 'కంప్లీట్ సర్కిల్'లా ఉంటుంది. ఎన్నో వేల ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలు, మరిచిపోలేని స్మృతుల సమాహారమే లైఫ్ అంటే. వాటిలో కొన్ని... మనిషికి లైఫ్ లాంగ్ ఆనందాన్ని ఇస్తే, మరికొన్ని భరించలేని బాధను నింపేస్తాయి. మనిషి మెదడులో శాశ్వతంగా గూడు కట్టుకునిపోయే... ఈ జ్ఞాపకాల దొంతరల నుంచి తప్పించుకోవాలన్నా చాలా కష్టం. కడవరకూ ఆ బాధనో లేదా సంతోషాన్నో మనతో పాటూ మోయాల్సిందే. ఒకవేళ మనకి నచ్చని, మనశ్శాంతి దూరం చేస్తున్న జ్ఞాపకాలను, స్మృతులను చెరిపేసే అవకాశం వచ్చినా
డెస్టినీ ముందే రాసినట్టుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్. విధి ఆడే వింత నాటకంలో పావు కావటం తప్ప.


Also Read: ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ మృతి


అత్యద్భుతమైన స్క్రీన్ ప్లేకి  గాను... ఈ చిత్రం ఆ ఏడాది బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ కైవసం చేసుకుంది. 21వ శతాబ్దంలో వచ్చిన 100 అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా 2016లో బీబీసీ ఈ చిత్రానికి పట్టం కట్టింది. జీవితంలో జరిగిపోయిన దాని గురించి బాధ పడటం లేదా జరగబోయే విషయాల గురించి ఆందోళన పడటం కంటే... మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అనే సందేశాన్ని బలంగా చాటడంతో పాటు... ఓ ఎవర్ గ్రీన్ సినిమాటిక్ హైని ఇస్తుంది ఈ ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. So Don't miss it.



Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?