Shakuntalam Movie Update: తెలుగు తెరకు సమంత (Samantha Ruth Prabhu) నటిగా, కథానాయికగా పరిచయమై పన్నెండేళ్ళు. తొలి సినిమా 'ఏ మాయ చేసావె' నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. నటనలో ఆమెకు అనుభవం ఉంది. అటువంటి సమంతకు ఇప్పుడు ట్రైనింగ్ అవసరమా? అనే సందేహం రావచ్చు. కానీ, సమంత మాత్రం 'శాకుంతలం' (Shakuntalam Movie) సినిమా కోసం ట్రైనింగ్ తీసుకున్నారు.


Samantha's First Ever Mythological Drama: మైథలాజికల్ కథతో రూపొందిన సినిమా 'శాకుంతలం'. సమంత కమర్షియల్ సినిమాలు చేశారు. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేశారు. అయితే... మైథలాజికల్ జానర్ మూవీ చేయలేదు. అందుకే, సినిమాలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనే విషయంలో ట్రైనింగ్ తీసుకున్నారు. (Samantha took body language training for Shakuntalam Movie) 


"షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు 'క్లాసికల్' మోడ్‌లో ఫిట్ అవ్వడం కోసం సమంత గారు బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకున్నారు. నేను తీసిన 'రామాయణం' సినిమాకు పని చేసిన టీమ్, ఆమెకు ట్రైనింగ్ ఇచ్చింది" అని దర్శకుడు గుణశేఖర్ (Director Gunasekhar On Samantha) వివరించారు. మైథలాజికల్ క్యారెక్టర్ కనుక ఏ విధంగా నడవాలి? ఎలా కూర్చోవాలి? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? వంటి విషయాల్లో సమంతకు ట్రైనింగ్ ఇచ్చారట.


'శాకుంతలం' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సమంత ఇంకో అంశంలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఎందుకు? అంటే... డబ్బింగ్ చెప్పడానికి! ఈ సినిమాలో తన పాత్రకు సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు (Samantha Dubs for her role In Shakuntalam Movie). శుద్ధ తెలుగులో డబ్బింగ్ కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నారట. ఇటీవల ఆమె డబ్బింగ్ పూర్తి చేశారు.


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత


'దిల్' రాజు (Dil Raju) స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై 'శాకుంతలం' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి నీలిమా గుణ (Neelima Guna) నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంతకు జోడీగా, ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. 


Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?