కథానాయకుడిగా పరిచయమైన 'అల్లుడు శీను' నుంచి 'ఛత్రపతి' (హిందీ) వరకు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ ఎక్కువ చేశారు యాక్షన్ హల్క్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). ఇప్పుడు రూటు మార్చి డిఫరెంట్ అండ్ వెరైటీ సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకుంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 11వ సినిమా 'కిష్కింధపురి' (Kishkindhapuri Movie). ఈ రోజు ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. 

Continues below advertisement


కొన్ని గొంతులు వింటే? కొన్ని తలుపులు తెరిస్తే?
'కిష్కింధపురి' చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 'చావు కబురు చల్లగా' తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రమిది. మొదటి సినిమా మెసేజ్ ఫిల్మ్ అయితే... రెండోది హారర్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం మీద శ్రీమతి అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇదొక గ్రిప్పింగ్ హారర్ మిస్టరీ సినిమా అని ఫస్ట్ లుక్ విడుదల సమయంలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ హారర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో గ్లింప్స్‌లో చూపించారు.


ఫస్ట్ గ్లింప్స్‌ ప్రారంభం నుంచి 'కిష్కింధపురి' ప్రపంచంలోకి తీసుకు వెళ్ళడానికి దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ప్రయత్నించారు. బెల్లంకొండతో పాటు కొందరు ఓ తలుపు తెరుచుకుని వెళతారు. అప్పుడు స్క్రీన్ మీద 'కొన్ని తలుపులు తెరవకూడదు' అని ఓ వార్నింగ్ పడింది. తర్వాత రేడియో కనిపిస్తే వాల్యూమ్ పెంచుతారు. అప్పుడు డోర్లు క్లోజ్ అవుతాయి. స్క్రీన్ మీద 'కొన్ని శబ్దాలు వినపడకూడదు' అని పడుతుంది. చివర్లో 'అహం మృత్యుమ్' అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే మాటతో గ్లింప్స్‌ ముగిసింది. దీనికి సామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. విజువల్స్ కూడా!


Also Read: జనవరి నుంచి జూన్‌కు ఎన్టీఆర్ నీల్ సినిమా... మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్‌ డేకు స్పెషల్ గ్లింప్స్‌



'రాక్షసుడు' తర్వాత మరోసారి జంటగా!
'కిష్కింధపురి'లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'రాక్షసుడు' విజయం తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ జంటగా నటిస్తున్న చిత్రమిది. 'కిష్కింధపురి' ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ సినిమాలో మిస్టరీ, మైథాలజీ అంశాలు సహా విజువల్ గ్రాండియర్ కళ్లకు కట్టినట్టు చూపించింది.


Also Readప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు



బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కళ: డి. శివ కామేష్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఎ దత్, ఛాయాగ్రహణం: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: సామ్ సిఎస్, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాత: సాహు గారపాటి, రచన - దర్శకత్వం: కౌశిక్ పెగల్లపాటి.