మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా సంక్రాంతికి రావడం లేదు.‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాను మొదట జనవరి 9న విడుదల చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారింది. జనవరి నుంచి జూన్‌ నెలకు వెళ్లారు.

జూన్‌ 25న 'డ్రాగన్' విడుదల!Dragon release date shifts from January to June: ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ ‌నీల్ దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ డ్రామాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు. అయితే ఆ న్యూస్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేశారు. అలాగే, ఎన్టీఆర్ బర్త్ డే మే 20న. ఈ సందర్భంగా 'డ్రాగన్' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు.

జూన్‌ 25, 2026న థియేటర్లలోకి డ్రాగన్ ‌(ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్) సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ ‌(గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ‌వై నిర్మిస్తున్నారు.

Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు

కర్ణాటక షెడ్యూల్‌లో ఎన్టీఆర్!ఏప్రిల్ 22, 2025న కర్ణాటకలో 'డ్రాగన్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలు అయింది. అందులో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ఆయన మీద ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: ఎవరీ ప్రియాంక? రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకంత డిస్కషన్... వశీతో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమకథ తెల్సా?

'దేవర' విజయం తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. అందులో మొదటిది బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న 'వార్ 2'. ఆ సినిమాలో హృతిక్ రోషన్ మరొక హీరో.‌ అది కొంత షూటింగ్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. త్వరలో 'దేవర 2' కూడా స్టార్ట్ చేయనున్నారు. 'దేవర'తో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. జపాన్ ఆడియన్స్ సైతం 'దేవర' చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాంతో ఎన్టీఆర్ చేసే సినిమాలు అన్ని తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్నాయి. అలాగే, జపనీస్ భాషలో డబ్బింగ్ చేయనున్నారు.