కథానాయకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) 25వ సినిమా 'కింగ్స్టన్' (Kingston Movie). సంగీతం అందించడంతో పాటు జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. దివ్యభారతి హీరోయిన్. ఈ సినిమాను తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Kingston Movie Story): సముద్ర తీరంలోని తోవత్తూర్ గ్రామంలో ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్ళరు. ఒకవేళ సముద్రంలోకి వెళితే శవాలుగా తిరిగి వస్తారు. ఒక మనిషి అత్యాశ వల్ల ఊరంతటికీ శాపం ఏర్పడిందని ఊరిలో పెద్దలు చెబుతారు. 

ఊరి కట్టుబాట్లను దాటి స్నేహితులతో కలిసి కింగ్ (జీవీ ప్రకాష్) సముద్రంలోకి వెళతాడు. అతనితో పాటు ప్రేమించిన అమ్మాయి రోజ్ (దివ్యభారతి) కూడా వెళుతుంది. ఊరంతటికీ డబ్బులు ఇస్తూ పని ఇస్తున్న థామస్ (సుబుమోన్)ను కింగ్ ఎందుకు తీసుకు వెళ్ళాడు? సముద్రంలో హీరో బోటును చుట్టుముట్టిన ఆత్మలు ఎవరివి? కింగ్ తాతయ్య సాల్మన్ (చేతన్) ఏం చేశారు? చివరకు ఏమైంది?

విశ్లేషణ (Kingston Review Rating Telugu): సముద్రం నేపథ్యంలో అడ్వెంచరస్ హారర్ ఫాంటసీ ఫిల్మ్ ఇది. జీవీ ప్రకాష్ కుమార్ ముందు నుంచి చెప్పినట్లు విజువల్స్ ఎఫెక్ట్స్, సముద్రంలో తీసిన సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక వచ్చే సీ సీన్స్ అన్నీ 'వావ్' అనేలా ఉంటాయి. హారర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ థియేటర్లలో ప్రతి ఒక్కరినీ భయపెట్టేలా ఉన్నాయి.

ఇప్పటి వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. అయితే, ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. కథ విషయంలో దర్శకుడు కమల్ ప్రకాష్ కొత్తగా ఆలోచించారు. అయితే, ఆ కొత్తదనం సెకండాఫ్ మొదలైన తర్వాత ఉంటుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా తీశారు. సగటు తమిళ సినిమా తరహాలో ఉంటుంది. కానీ, ఒక్కసారి సముద్రంలోకి వెళ్లిన తర్వాత సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ హారర్ మూమెంట్స్ ఇచ్చారు. సముద్రంలో అంత మంచి వరల్డ్ క్రియేట్ చేసిన దర్శకుడు, దానికి ముందు మంచి సీన్లు రాసుకుని ఉంటే బావుండేది. ప్రోస్థటిక్ మేకప్ కూడా బాగా చేశారు. టెక్నికల్ పరంగా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి.

Also Read'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా'... మళ్లీ కార్తీక దీపమే టాప్.. టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి

జాలరిగా, సముద్ర తీరంలోని పల్లెటూరి యువకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ జీవించారు. మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో తీసుకున్న కేర్ బావుంది. ఇంటెన్స్ యాక్టింగ్ చూపించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో బాగా చేశారు. దివ్యభారతి కనిపించే సీన్లు తక్కువ. కానీ, ఇంపార్టెంట్ రోల్ చేశారు. హీరో స్నేహితులు పర్వాలేదు. చేతన్, అళగమ్ పెరుమాళ్ మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.

ఫాంటసీ హారర్ సినిమాల్లో 'కింగ్స్టన్' కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత భయపెట్టే సన్నివేశాలు బావున్నాయి. ఫస్టాఫ్ రొటీన్ అనిపించినా... సెకండాఫ్ కోసం పునాది వేయడం వల్ల అక్కడ థ్రిల్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యింది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. మనిషి అత్యాశ ఉండకూడదని మంచి సందేశం ఇచ్చారు. థ్రిల్లర్ ఫిలిమ్స్ కోసం చూసే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంగేజ్ కావడం గ్యారంటీ.

Also Readఅగత్యా రివ్యూ: భయానికి, వినోదానికి మధ్య సంఘర్షణ... తమిళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?