Kingdom Movie Review In Telugu: అమెరికాలో 'కింగ్‌డమ్‌' ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఒమన్ దేశంలో కూడా! ఓవర్సీస్ నుంచి విజయ్ దేవరకొండ సినిమాకు ఎటువంటి టాక్ లభించింది? ఎన్నారై ఆడియన్స్ ఏమంటున్నారు? దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎలా తీశారు? విజయ్ దేవరకొండ హిట్టు కొట్టాడా? అనేది తెలుసుకోండి. 

Continues below advertisement


టెక్నికల్‌గా వెరీ స్ట్రాంగ్ సినిమా!
'కింగ్‌డమ్‌' చూసిన ఆడియన్స్ అందరి నోటా వినిపించే ఏకైక మాట... టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్‌ అని! అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కావచ్చు, జోమోన్ టి జాన్ & గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కావచ్చు, ప్రొడక్షన్ వేల్యూస్ కావచ్చు... టెక్నికల్ అంశాలు అన్నీ బావున్నాయని చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా అంటున్నారు. 'రగిలే రగిలే...' సాంగ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయట. అనిరుధ్ ఆర్ఆర్ కూడా సినిమాకు ప్లస్ అంటున్నారు.  


కథలో మలుపుల్లేవ్... పాయింటే!
'కింగ్‌డమ్‌' కథ ఏమిటనేది ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఎటువంటి మలుపులు లేకుండా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నేరుగా కథలోకి తీసుకు వెళ్ళాడని ట్వీట్స్ చేస్తున్నారు కొందరు. స్టోరీ బేస్డ్ డ్రామాగా సినిమాను తీశారట. మధ్య మధ్యలో కాస్త డల్ అనిపించినా ఓవరాల్‌గా చూస్తే తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను గౌతమ్ చక్కగా చెప్పారని, ఎక్కువ శాతం ఎంగేజ్ చేశారని ఎన్నారై జనాలు చెప్పారు. మన ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా కథ, కథనాలు ఉండటం కాస్త మైనస్ అన్నారు.


Also Readవిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?


ఫస్టాఫ్‌లో శ్రీలంక... క్లైమాక్స్ కేక!
ఇంటర్వెల్ ముందు, తర్వాత అన్నట్టు మాట్లాడుకోవలసి వస్తే... ఫస్టాఫ్‌లో శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సీన్స్ అన్నీ బాగా వచ్చాయట. శ్రీలంకలోని జఫ్నా జైలు నేపథ్యంలో సన్నివేశాలు సైతం బావున్నాయట. అయితే... ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఎక్కువ ఎంగేజ్ చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్, పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ చాలా బావుందని చెప్పారు. సెకండాఫ్‌లో విలన్ సీన్ ఒకటి బాగా వచ్చిందట.


సూరిగా కుమ్మేసిన రౌడీ బాయ్!
లాస్ట్, బట్ నాట్ లీస్ట్... సూరి పాత్రలో విజయ్ దేవరకొండ కుమ్మేశారట. నటుడిగా ఆ పాత్రకు అవసరమైన రీతిలో బెస్ట్ ఇచ్చారని ఎన్నారై జనాలు చెప్పారు. ఆయన నటన పరంగా ఎటువంటి లోపాలు లేవట. 'కింగ్‌డమ్‌'తో విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఆయనకు జంటగా భాగ్యశ్రీ బోర్సే అందం, అభినయం కలిసిన పాత్రలో కనిపించారట. స్క్రీన్ స్పేస్ తక్కువైనా చాలా చక్కగా చేశారట. సత్యదేవ్ మరోసారి ఇంటెన్స్ రోల్ చేశారని, విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో ఆయన నటన అద్భుతమని అంటున్నారు.


Also Readవార్ 2 వర్సెస్ కూలీ... రజనీ మూవీని డామినేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా



'కింగ్‌డమ్‌'కు ఓవరాల్ ప్రీమియర్స్ టాక్ చూస్తే... మెజారిటీ జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగని కంప్లీట్ హిట్ అని కూడా చెప్పలేం. కొందరు నెగిటివ్ ట్వీట్స్ కూడా చేశారు. నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ అంటే పడని కొందరు బాలేదని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల, అమెరికా నుంచి మిక్స్డ్ టాక్ వినబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, బెంగళూరులో షోస్ పూర్తి అయ్యాక వచ్చే టాక్ సినిమా విజయానికి కీలకం కానుంది.