బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆగస్టు 14న 'కూలీ', 'వార్ 2' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క విషయంలో రజనీ సినిమాను ఎన్టీఆర్ మూవీ డామినేట్ చేసింది. అది ఏమిటో తెలుసా?

'కూలీ' కంటే 'వార్ 2' పెద్దదిమాఫియా నేపథ్యంలో 'కూలీ' తెరకెక్కింది. ఒక రిటైర్డ్ డాన్ (రజనీకాంత్) తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మాఫియాలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అతను ఏం చేశాడు? అనేది కథ. 'వార్ 2' విషయానికి వస్తే... కబీర్ (హృతిక్ రోషన్) 'రా' ఏజెంట్. ఒక మిషన్ విషయంలో దేశానికి ఎదురు తిరుగుతాడు. అతడ్ని పట్టుకోవడం కోసం మరొక ఏజెంట్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దించుతుంది 'రా'. వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధమే 'వార్ 2' కథ. 

'కూలీ', 'వార్ 2'... రెండూ యాక్షన్ కథలే. రెండిటిలోనూ దేశమంతటా - పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసిన స్టార్స్ ఉన్నారు. అయితే 'కూలీ' కంటే 'వార్ 2' పెద్ద సినిమా. బిజినెస్ పరంగా లేదంటే స్టార్ కాస్ట్ పరంగా ఈ మాట చెప్పడం లేదు. రన్ టైమ్ పరంగా చెబుతున్న మాట. 

'కూలీ' రన్ టైమ్ 2.50 గంటలు అయితే... ఆ సినిమా కంటే 'వార్ 2' పావుగంట పెద్దది. అవును... ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన సినిమా రన్ టైమ్ 3.05 గంటలు. అదీ సంగతి. 

Also Read: 'కింగ్‌డమ్‌' ఫస్ట్ షో డీటెయిల్స్... విజయ్ దేవరకొండ సినిమాకు ట్విట్టర్ రివ్యూస్, USA Premier Shows రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

'వార్ 2'కు తెలుగు భారీ క్రేజ్ నెలకొనడానికి కారణం ఎన్టీఆర్. రజనీకి తెలుగులో క్రేజ్ ఉన్నప్పటికీ... నాగార్జున విలన్ రోల్ చేయడం వల్ల 'కూలీ'కి మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంకా ఆ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రత్యేక గీతం 'మోనికా...'లో సందడి చేశారు.

తెలుగులో ఎవరు విడుదల చేస్తున్నారంటే?War 2 Movie Telugu Release Rights: 'వార్ 2'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ ముందు సినిమా 'దేవర'ను కూడా నాగవంశీ విడుదల చేశారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్... ఇద్దరితో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలను నాగవంశీ కుటుంబం నిర్మిస్తోంది. 'కూలీ' సినిమాను తెలుగులో అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు.

Also Readవిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?