Vijay Deverakonda's Kingdom movie USA Premieres Report: 'ది' రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా 'కింగ్‌డమ్'. జూలై 31న విడుదల. అయితే ఇండియాలో షోస్ మొదలు అయ్యే సమయానికి అమెరికా నుంచి రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతి సినిమాకు అమెరికాలో ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ వైపు ప్రేక్షకులు చూస్తున్నారు. మరి, 'కింగ్‌డమ్' ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతుంది? ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి? వంటి వివరాల్లోకి వెళితే...

ఇండియాలో ప్రీమియర్స్ లేవు...అమెరికా నుంచి వచ్చే రిపోర్ట్ కీలకం!ఏపీ, తెలంగాణలో 'కింగ్‌డమ్' ప్రీమియర్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయడం లేదు. 'కింగ్‌డమ్' ఫస్ట్ షో అమెరికాలో పడుతోంది. అక్కడ జూలై 30వ తేదీ రాత్రి 12.30 గంటల నుంచి ప్రీమియర్ షోస్ షెడ్యూల్ చేశారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం బుధవారం రాత్రి పది, పదకొండు గంటలకు షోలు పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో అంటే ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో మల్లిఖారున థియేటర్‌లో ఉదయం 7.15 గంటలకు పడే షో అని చెప్పాలి. 

ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు?ట్విట్టర్ రివ్యూస్ ఏ టైంకి వస్తాయంటే??Kingdom Movie Runtime: 'కింగ్‌డమ్' సినిమా రన్ టైమ్ 2.40 గంటలు. మధ్యలో ఇంటర్వెల్ 20 నిమిషాలు వేసుకున్నా... టోటల్ మూడు గంటలు. బుధవారం మిడ్ నైట్ ఒంటి గంటకు ప్రీమియర్స్ షో రిపోర్ట్ వస్తుంది. గురువారం తెల్లవారుజామున రివ్యూలు సైతం వస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో పడే సమయానికి రిజల్ట్ ఏమిటనేది బయట పడుతుంది.

'కింగ్‌డమ్' సెన్సార్ సర్టిఫికేట్ ఏంటి?ఏయే సన్నివేశాలు కత్తెరకు బలి అయ్యాయ్??Kingdom Censor Certificate: 'కింగ్‌డమ్' సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. వయలెన్స్ ఎక్కువ ఉన్న సన్నివేశాలకు కత్తెర పడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా బావుందని టాక్. అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. బుక్ మై షోలో 100k ప్లస్ టికెట్స్ సేల్ అయ్యాయి.

Also Readవిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?

'కింగ్‌డమ్'లో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే నటించారు. హీరోకి అన్న పాత్రలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా... 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.

Also Readఓటీటీలోకి 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' వచ్చేది నెల రోజుల్లోనే... ఆగస్టులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్... ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?