పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న‌ ఈ మూవీ షూటింగ్‌లోనే ఎన్నో ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు చోటు చేసుకున్నాయి. సినిమా పూర్తి కాకుండానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొన్నారు. జ్యోతికృష్ణ సినిమాను పూర్తి చేశారు. ప‌లుమార్లు రిలీజ్ వాయిదా ప‌డింది. ఎన్నో ఆటంకాల‌ను దాటుకొని భారీ అంచ‌నాల న‌డుమ జూలై 24న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్. 

Continues below advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్...అతి క‌ష్టంగా వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది 'హరి హర వీరమల్లు'. ఈ హిస్టారిక‌ల్ మూవీ నిర్మాత‌ల‌కు భారీగానే న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. నెల రోజుల గ్యాప్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకున్న‌ది. థియేట‌ర్ రిజ‌ల్ట్ ఎఫెక్ట్ కార‌ణంగా నాలుగు వారాల గ్యాప్‌లోనే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాల‌ని అమెజాన్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఆగ‌స్ట్ 22 నుంచి 'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Continues below advertisement

Also Readప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా, తమిళంలో హిట్... ఫ‌హాద్ ఫాజిల్ తండ్రితో ప‌వ‌ర్‌ స్టార్ చేయాల్సిన సినిమా... అది ఏదో తెలుసా?

వీరమల్లుకు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు...'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' మూవీకి క్రిష్‌ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొఘ‌లుల కాలం నాటి క‌థ‌తో  రూపొందిన ఈ మూవీలో వీర‌మ‌ల్లు అనే యోధుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించారు. హిందువుల‌పై మొఘ‌ల్ రాజు ఔరంగ‌జేబు సాగించిన అకృత్యాల‌ను, స‌నాత‌న ధ‌ర్మం గొప్ప‌త‌నాన్ని ఈ మూవీలో చూపించారు. కొల్లూరులో దొరికిన కోహినూర్ డైమండ్ మొఘ‌ల్ రాజుల వ‌ద్ద‌కు ఎలా చేరింది? ఆ వ‌జ్రాన్ని ఔరంగ‌జేబు నుంచి కొట్టేయ‌డానికి వీర‌మ‌ల్లు ఏం చేశాడ‌న్న‌ది యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర‌స్ అంశాల‌తో క్రిష్, జ్యోతికృష్ణ ఈ మూవీలో ఆవిష్క‌రించారు. 

Also Read: విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్టింగ్‌, ఆయ‌న‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ అంశాలు బాగున్నా వీఎఫెక్స్, సీజీ వ‌ర్క్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం  సినిమాకు మైన‌స్‌గా మారింది. రెండో పార్ట్ కోసం  క‌థ‌ను అసంపూర్తిగా ముగించ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. 'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' మూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. పంచ‌మిగా ఆమె క్యారెక్ట‌ర్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ మూవీలో ఔరంగ‌జేబు పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు బాబీడియోల్ క‌నిపించాడు. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం ఈ మూవీ నిర్మించారు. 

Pawan Kalyan Upcoming Movies: 'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' త‌ర్వాత 'ఓజీ'తో పాటు 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' సినిమాలు చేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'ఓజీ' సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతుంది. 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇటీవల క్లైమాక్స్ పూర్తి చేశారు.