యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కెజియఫ్ 2' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ 31వ చిత్రమిది. ఎన్టీఆర్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చిందంటే... అంత కంటే కిక్ ఆ తర్వాత వచ్చిన మరో అప్‌డేట్‌ ఇచ్చింది.


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయని వినబడుతున్న సంగతి తెలిసిందే. 'కెజియఫ్ 1'లో గరుడ రామ్, 'కెజియఫ్ 2'లో సంజయ్ దత్ పాత్రలు చూస్తే... విలన్ రోల్స్ డిజైన్ చేయడంలో ప్రశాంత్ నీల్ ఎంత జాగ్రత్త వహిస్తారో అర్థం అవుతుంది. అందువల్ల, కమల్ విలన్ అనేసరికి అందరిలో ఆసక్తి పెరిగింది. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే...


ఇటీవల కమల్ హాసన్‌ను కలిసిన ప్రశాంత్ నీల్ NTR 31 కథ, అందులో విలన్ క్యారెక్టర్ వివరించారట. 'ఓకే' అని గానీ, 'నో' అని గానీ...  కమల్ ఏమీ చెప్పలేదట. ఆయన రెస్పాన్స్ కోసం ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం 'విక్రమ్' ప్రచార కార్యక్రమాల్లో కమల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ 31 సినెమాలో విలన్ రోల్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Also Read: యుద్ధంతో రాసిన ప్రేమకథ 'సీతా రామం' ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందంటే? దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్


'విక్రమ్'లో కమల్ లుక్ చూసే... ఎన్టీఆర్ 31లో విలన్ రోల్ ఆఫర్ చేశారట ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also Read: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్‌లో అది కామన్