రష్మిక మందన్నా (Rashmika Mandanna) మోడ్రన్ అమ్మాయి. ఎట్ ద సేమ్ టైమ్, ఆమె ట్రెడిషన్స్ కూడా ఫాలో అవుతారు. ఈ కన్నడ భామకు భక్తి ఎక్కువ అని చెప్పవచ్చు. ఫెస్టివల్స్ టైమ్‌లో పూజలు చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు ఎందుకీ భక్తి ప్రస్తావన అంటే... బెంగళూరు వెళ్ళిన ప్రతిసారీ రష్మిక ఒక పని చేస్తారు. ఆమెకు అదొక సెంటిమెంట్. అదేంటో తెలుసా? విఘ్నేశ్వరుడికి పూజలు చేయడం!


ఏదైనా పని ప్రారంభించే ముందు... సకల విఘ్నాలు తొలగాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని కొంత మంది విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. రష్మిక బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి ముందు గణేశుడి దర్శనం చేసుకుని, పూజ చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారట. ''బెంగళూరులో నా ప్రయాణం ఎప్పుడూ... ఎల్లప్పుడూ... గణపతితో ప్రారంభం అవుతుంది'' అని ఆమె పేర్కొన్నారు. 


Also Read: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?


సినిమాలకు వస్తే... ప్రస్తుతం హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై', 'యానిమల్' తెలుగులో 'సీతా రామం', 'పుష్ప : ద రూల్', తమిళంలో విజయ్ సరసన ఒక సినిమా చేస్తున్నారు.


Also Read: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్