Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ రెండు కొత్త సినిమాలకు సంతకం చేశారు. అయితే, దర్శకులను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు. 

Continues below advertisement

Venkatesh New Movie Updates: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'ఎఫ్ 3' సినిమా ఈ శుక్రవారం (మే 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ మరో కథానాయకుడు. ఈ సినిమా పక్కన పెడితే... దీని తర్వాత వెంకటేష్ ఏ సినిమా చేస్తారు? ఎవరితో చేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

Continues below advertisement

వెంకటేష్ రెండు కొత్త సినిమాలు కన్ఫర్మ్ చేశారు. అయితే, ఇంకా దర్శకులను ఫైనలైజ్ చేయలేదు. నిర్మాణ సంస్థలను మాత్రం ఖరారు చేశారు. 'ఎఫ్ 3' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో సమావేశమైన వెంకటేష్, తదుపరి సినిమాల వివరాలు వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒక సినిమా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో మరో సినిమా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే, ఆయా సినిమాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది చెప్పలేదు. ప్రస్తుతం ఇద్దరు దర్శకులను కన్ఫర్మ్ చేసే పనిలో పడ్డారు.

'ఎఫ్ 3' విషయానికి వస్తే... 'ఎఫ్ 2' కంటే మూడింతలు వినోదం అందిస్తామని వెంకటేష్ చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలు, పాటలకు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలు చేసినట్టు 'ఎఫ్ 3'ని కూడా చాలా స్పాంటేనియస్‌గా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి సినిమాలు చేసినప్పుడు ఇమేజ్ పక్కన పెట్టాలని వెంకటేష్ అన్నారు.

Also Read: మే 25 (ఈ రోజు) ఎపిసోడ్ : వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్ - లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

Also Read: కార్తీక దీపం మే 25 (ఈ రోజు) ఎపిసోడ్ : నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Continues below advertisement