సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 


'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఈరోజు నుంచి కొన్ని చోట్ల సినిమా ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ ప్రివ్యూలను హైదరాబాద్‌, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్‌, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రేక్షకులు చెప్పిన విధానం అద్భుతంగా ఉందని సెన్సార్ బోర్డ్ చిత్రబృందాన్ని ప్రశంసించిందట. సెన్సార్ షో అవ్వగానే సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిందట సెన్సార్ టీమ్.


Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్


Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!