ఎగ్జామ్‌కు వెళ్తున్న వసుధార చేయిని పట్టుకొని... ఇవాళ మనకు చాలా ముఖ్యమైన రోజని... ఎప్పటికీ గుర్తుండిపోతుందంటాడు రిషి. వసుధారకు ఇవేమీ అర్థం కాదు. పెన్‌ తీసి ఇచ్చి ఆల్‌ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు. పెన్ చూపించి ఇదే నాకు  పెద్ద గిఫ్ట్ అంటుంది వసుధార. లేదు వసుధార జీవితంలో ఊహించని గిఫ్ట్ ఇస్తానని మనసులో అనుకుంటాడు. రిషిని ఇచ్చిన ధైర్యంతో అక్కడి నుంచి ఎగ్జామ్ హాల్‌కు వెళ్తుంది వసుధార. తన మనసులోని మాట చెప్పడానికి రెడీ అవుతాడు రిషి. మంచి గిఫ్ట్ కొనేందుకు వెళ్తాడు. 


ఇంతలో ఎగ్జామ్ హాల్ వద్దే ఉన్న సాక్షి... వసుధార కోసం ఎదురు చూస్తుంది. అసలైన ఎగ్జామ్ ఇప్పుడే మొదలవుతుందని... రిషి నుంచి ఎలా దూరం చేస్తానో చూడని అనుకుంటుంది. 


ఇంతలో కారులో కూర్చున్న రిషి పెద్దమ్మ పంపించిన వెడ్డింగ్ కార్డు చూస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పెద్దమ్మకు ఫోన్ చేస్తాడు. వెడ్డింగ్ కార్డు ఏంటీ... సాక్షి ఫొటో ఏంటని ప్రశ్నిస్తాడు. ముందు ముందు చాలా అవసరమని మహేంద్రే డిజైన్ చేయించాడని... మాట్లాడమని ఫోన్ ఇస్తుంది. వెడ్డింగ్ పార్టర్‌ను ఎలాగూ నువ్వు నిర్ణయించుకోవడం లేదని... అందుకే ఆమెను దేవయాని నిర్ణయించిందని చెప్తాడు. దీంతో రిషి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. 


వసుధార కూల్‌గా ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటుంది. ఆమెకు రిషి చెప్పిన సంగతులు గుర్తుకు వస్తాయి. పెన్ చూసుకొని రిషి అక్కడే ఉన్నాడన్న ఫీల్‌తో ఉంటుంది. 


మహేంద్ర చేసిన పనికి జగతి కోప్పడుతుంది. రిషి ఎంత డిస్టర్బ్ అవుతాడో మీకు తెలియదా అని అడుగుతుంది. దేవయాని వలలో పడిపోయావని అంటుంది. రిషిపై ఒత్తిడి పెంచితేనే ఏదో నిర్ణయం తీసుకుంటాడని... వసుధారపై అభిప్రాయాన్ని చెబుతాడని మహేంద్ర అంటాడు. ఈ ఆపరేషన్ శుభలేఖతో మంచి జరుగుతుందని అంటాడు. 


వెడ్డింగ్ కార్డు తలచుకొని కోపంతో రగిలిపోతుంటాడు రిషి. వెడ్డింగ్‌ కార్డులో సాక్షి నా పక్కన ఉండటమేంటని... తనను నేను పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకుంటాడు. సాక్షిని ఒప్పుకోనప్పుడు ఇంకా ఎవర్ని ఆహ్వానిస్తున్నానో అని ప్రశ్న మొదలవుతుంది. ఇంతలో వసుధారతో క్లోజ్‌గా ఉన్న సీన్స్ మైండ్‌లో ఫ్లాష్ అవుతాయి. వసుధార దగ్గర లేకుంటే బాధగా... దగ్గర ఉంటే ఆనందంగా ఉంటుందని... ఇదేనా ప్రేమ అంటే అనుకుంటాడు. సాక్షిపై ఎలాంటి కోపం లేదు.. ప్రత్యేకంగా ఎలాంటి అభిప్రాయం లేదంటాడు. అందుకే ఆమె వచ్చి మాట్లాడుతుంటే భరించలేకపోతున్నానని... నాకు తెలియకుండానే నా మనసు వసుధారవైపు మొగ్గుతుందా... వసుధారను ప్రేమిస్తుందా అనుకుంటాడు. దీన్నే ప్రేమ అంటారా? అని తనను తాను ప్రశ్నించుకుంటాడు రిషి. వసుధార నా కోపాన్ని భరిస్తుంది.. సాక్షి నాకు కోపాన్ని తెప్పిస్తుందని అనుకుంటాడు. నేను మనశాంతిగా లేనప్పుడు వసుధార మాట హాయినిస్తుంది. తన ప్రతి పరియం ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని అంటాడు. అంతకంటే ఏం కావాలి... నాకు ఏం కావాలో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అనుకుంటాడు. కాదు.. నాకు ఎప్పుడే అర్థమైంది.. కానీ మనసు చెప్పే మాటల్ని నేను వినిపించుకోలేదు.. తనను నాకు కావాలని డిసైడ్‌ అవుతాడు. ఎస్‌... నాకు ఇప్పుడు అర్థమైంది.. మిస్టర్‌ రిషేంద్ర భూషణ్‌... నీకు వసుధార కావాలి... చివరకి వరకు నిలిచే తోడు అని డిసైడ్ అవుతాడు.