హాలీవుడ్ మూవీలో మన స్టార్స్ నటిస్తున్నారంటే.. ఆ ఆసక్తే వేరు. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే మన అభిమాన నటుడిని అందులో వెతుక్కుంటాం. స్క్రీన్ మీద ప్రత్యక్షం కాగానే.. హమ్మయ్య అని అనుకుంటాం. ప్రస్తుతం తమిళ నటుడు ధనుష్ అభిమానులు కూడా అదే అనుకున్నారు. కానీ, ‘హమ్మయ్య’ అనుకొనేందుకు కూడా అవకాశం లేకుండా ధనుష్ ట్రైలర్‌లో కనిపించాడు. ఓ ఫైట్ సీన్‌లో తళుక్కున మెరిసి మాయమయ్యాడు. దీంతో అభిమానులు బాగా నిరాశకు గురవ్వుతున్నారు. కొందరైతే మీమ్స్, జోక్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. 


ధనుష్ తొలిసారి నటిస్తున్న హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’. ఈ సినిమా ట్రైలర్ కోసం ఆయన అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ధనుష్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ట్రైలర్‌ను షేర్ చేశాడు. అయితే, ఈ ట్రైలర్‌లో ధనుష్ కేవలం ఒక్క సెకన్ మాత్రమే కనిపించాడు. అయితే, ట్రైలర్ చివర్లో మాత్రం ఆయన పేరును వేసి.. అభిమానులకు కాస్త ఊరట ఇచ్చారు. ఈ చిత్రానికి రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. 


Also Read: ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!


ఇందులో ర్యాన్ గోస్లింగ్.. కోర్ట్ జెంట్రీగా నటించాడు. ఈ కథ ‘సియెర్రా సిక్స్’ అనే కోడ్ నేమ్ చుట్టూ తిరుగుతుంది. తన ఏజెన్సీకి సంబంధించిన నేరపూరిత రహస్యాలను కనిపెట్టిన ఏజెంట్‌ను పట్టుకొనే టాస్క్‌ను ఓ కిరాయి హంతకుడికి అప్పగిస్తారు. ఈ సందర్భంగా వచ్చే పోరాట సన్నివేశాలు వాహ్ అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే, స్క్రీన్ టైమ్‌లో ఎక్కువ భాగం ర్యాన్, క్రిస్‌లకు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో ధనుష్ పాత్ర ఏమిటనేది పూర్తిగా తెలియరాలేదు. ట్రైలర్‌లో ఓ ఫైట్ సన్నివేశంలో మాత్రమే ధనుష్ కనిపిస్తాడు. కేవలం ఒక సెకన్ కనిపించి మెరుపు తీగలా మాయమవుతాడు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. 


Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!


The Gray Man Trailer: