బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లో కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. వారికోసం హౌస్ లో స్మోకింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్లి మాత్రమే స్మోక్ చేయాలి. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కొందరు కంటెస్టెంట్స్ కెమెరాకి కనిపించకూడదని బాత్రూమ్ లోకి వెళ్లి స్మోక్ చేసేవారు. అలా స్మోక్ చేసి అషురెడ్డి ఆల్రెడీ దొరికిపోయింది. పైగా అఖిల్ ఆమెకి సిగరెట్లు, లైటర్ సప్లై చేస్తూ కెమెరా కళ్లు కప్పడానికి ప్రయత్నించాడు. 


తేజస్వి, ముమైత్ ఖాన్, హమీదాలకు స్మోక్ చేసే అలవాటు ఉండడంతో వాళ్లకు కేటాయించిన స్మోకింగ్ జోన్ ఏరియాలలోనే సిగరెట్ కాల్చేవారు. అషురెడ్డి మాత్రం జనానికి తెలియకుండా సీక్రెట్ గా బాత్రూమ్ లో స్మోక్ చేసి కెమెరాలకు దొరికిపోయింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి సైతం బాత్రూమ్ లో స్మోకింగ్ చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు నటరాజ్ మాస్టర్. 


గతంలో అఖిల్ కూడా ఈ బాత్రూమ్ మేటర్ ని బయటకు తీశాడు కానీ వాటిని నిరూపించడంతో ఫెయిల్ అయ్యాడు. ఏదో వాగేశానని.. తాను మాట్లాడిన దాంట్లో నిజం లేదని నాగార్జున ముందు ఒప్పుకున్నాడు. నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఉండగా.. బిందు మాధవి సిగరెట్ల ఇష్యూ గురించి చెప్పలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు మాటల దాడి మరింత పెంచారు. 


దీనిలో భాగంగా బిందు మాధవి బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ తెలియకుండా బాత్రూమ్ లోకి వెళ్లిమరీ సిగరెట్లు తాగేదని.. వాసన రాకుండా గుడ్లు కొట్టేసేదని.. గుడ్లు వరుసగా మిస్ అవ్వడంతో తనకు అనుమానం వచ్చిందని బిందు మాధవిపై ఆరోపణలు చేశాడు. హౌస్ లో ఉన్నప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదో మాత్రం చెప్పలేదు నటరాజ్ మాస్టర్. 


నటరాజ్ మాస్టర్ తో పాటు స్రవంతి కూడా ఈ విషయంపై కొన్ని కామెంట్స్ చేసింది. ఆమె హౌస్ లో ఉన్నప్పుడు.. బిందు మాధవి సిగరెట్ల విషయం గురించి అజయ్ తో సీక్రెట్ గా చర్చించింది. బాత్రూమ్ లో సిగరెట్లు తాగుతుందని అజయ్ చెవిలో చెప్పింది. శ్రీరాపాక కూడా బిందు మాధవి స్మోక్ చేస్తుందని లీకులిచ్చింది. ఈ విషయంపై స్పందించిన బిందు మాధవి.. స్మోకింగ్ చేయాలనిపిస్తే అందరి ముందే తాగేదాన్ని కానీ బాత్రూమ్ లోకి వెళ్లి స్మోక్ చేయాల్సిన అవసరం తనకు లేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. 


రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన అభిమానులతో మాట్లాడిన ఆమెని.. ఈ బాత్రూమ్ స్మోకింగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో నిజం లేదని చెప్పింది బిందు మాధవి. తనకు నిజంగానే స్మోక్ చేయాలనిపిస్తే.. ఓపెన్ గా చేసేదాన్ని అంటూ క్లారిటీ ఇచ్చింది. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్


Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!