బిగ్ బాస్ నాన్-స్టాప్ షో శనివారం నాటి ఎపిసోడ్ తో ముగిసిపోయింది. ఈసారి ఫైనల్స్ లో టాప్ 7 కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. అందులో ముందుగా అనిల్, బాబా భాస్కర్ లను ఎలిమినేట్ చేశారు. ఆ తరువాత మిత్రాశర్మను ఎలిమినేట్ చేశారు. టాప్ 4లో అఖిల్, బిందు మాధవి, అరియనా, శివ ఉండగా.. వారికి సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. డబ్బులకు టెంప్ట్ అయిన అరియనా.. సూట్ కేస్ తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. 


ఆ సూట్ కేస్ లో రూ.10 లక్షలు ఉన్నాయని చెప్పారు నాగార్జున. ఈ పది లక్షల మొత్తాన్ని విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి మినహాయిస్తారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా.. అందులో అరియనా గెలుచుకున్న రూ.10 లక్షలను తీసేస్తారు. ఆ మిగిలిన రూ.40 లక్షలు మాత్రమే విన్నర్ కి ప్రైజ్ మనీగా ఇచ్చారు. అంటే ఈ లెక్కన టైటిల్ గెలిచిన బిందు మాధవికి వచ్చే ప్రైజ్ మనీ కేవలం రూ.40 లక్షలు మాత్రమే. 


ఈ మొత్తంలో టాక్స్ మినహా ఇస్తారు. గత సీజన్లలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తే అందులో దాదాపుగా 28 శాతం టాక్స్ మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇచ్చేవారు. అంటే.. రూ.50 లక్షల్లో చేతికి వచ్చేది రూ.36 లక్షలు. అయితే ఈసారి అరియనాకి పది లక్షలు ఇవ్వడంతో.. విన్నర్ కి రూ.40 లక్షలు మాత్రమే వచ్చాయి. దీనిపై 28 శాతం టాక్స్ అంటే.. విన్నర్ ప్రైజ్ మనీ రూ.30 లక్షలు వరకు ఉంటుంది. 


Also Read: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే


Also Read: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!