సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని ఓ సన్నివేశం ఉంది. హీరోయిన్ వచ్చి.. హీరోను బూతులు తిట్టే సీన్. మహేష్ సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి సీన్ చూసి ఉండరు. హీరోయిన్లంతా అతడికి పడిపోయి చుట్టూ తిరిగే పాత్రలే చూశాం. 

 

అలాంటిది 'సర్కారు వారి పాట'లో మహేష్ ను కీర్తి బూతులు తిట్టే సీన్ పెట్టారు దర్శకుడు. పైగా 'బో**' అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఆ అనుభవాన్ని కీర్తి తాజాగా బయటపెట్టింది. మహేష్ ను తిడుతున్నప్పుడు తన గుండె ఆగిపోయినంత పనైందని.. ఆ సీన్ చూసి మహేష్ ఫ్యాన్స్ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారేమోనని భయపడ్డానని తెలిపింది. 

 

మహేష్ గారి మొహం చూసి.. మొహం మీద చేయి చూపిస్తూ.. 'బో**' అని తిట్టాలి.. అది నా వల్ల కాలేదని.. ముందు మెల్లగా చెబితే డైరెక్టర్ ఒప్పుకోలేదని.. మహేష్ ఫ్యాన్స్ ఏమంటారో అని భయపడ్డానని తెలిపింది. మొత్తానికి ఎలాగోలా ఆ సీన్ చేశా కానీ.. మహేష్ ఫ్యాన్స్ ఏమంటారో అనే భయం ఇప్పటికీ ఉందని చెప్పుకొచ్చింది కీర్తి. ఇలా మహేష్ ని బూతులు తిట్టడానికి ఆమె పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 

 

ఈ ఎపిసోడ్ పై మహేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. కీర్తి సురేష్ తనను సరిగ్గా తిట్టడం లేదని.. ఒక దశలో తనే వెళ్లి తిట్టమని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందని అన్నారు మహేష్. సినిమాలో ఆ సీన్ చూసి మహేష్ బాబు కూతురు సితార తెగ నవ్వుకుందట. దాదాపు 15 నిమిషాల పాటు అలా నవ్వుతూనే ఉందట. సితార అలా నవ్వడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు మహేష్.