బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు. 


బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్ వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు.  అషురెడ్డికి బకెట్, నటరాజ్ మాస్టర్ కి కొరడా.. ఇలా ఫన్నీ అవార్డ్స్ ప్రకటించారు. 


ఆ తరువాత టాప్ 5లో ఉన్న మిత్రాశర్మను ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. స్టేజ్ పైకి వచ్చిన ఆమె చాలా ఎగ్జైటెడ్ గా నాగార్జునతో మాట్లాడింది. కాసేపటికి 'ఎఫ్3' టీమ్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. దర్శకుడు అనిల్ రావిపూడి, మెహ్రీన్, సునీల్ లు వచ్చారు. కాసేపు హౌస్ మేట్స్ తో మాట్లాడిన తరువాత డబ్బు సూట్ కేస్ పట్టుకొని హౌస్ లోకి వెళ్లారు అనిల్ రావిపూడి, సునీల్. తన దగ్గరున్న డబ్బుతో టాప్ 4 కంటెస్టెంట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. 


అఖిల్ కానీ, బిందు కానీ డీల్ మాట్లాడే ఇంట్రెస్ట్ లేనట్లు చెప్పేశారు. దీంతో అరియనా, శివలతో డీల్ మాట్లాడడానికి ట్రై చేశారు. అరియనా తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ప్రవర్తించింది. ఫైనల్ గా ఆలోచించి సూట్ కేస్ తీసేసుకుంది అరియనా. అందులో డబ్బు ఉందని.. నీ కెరీర్ కి హెల్ప్ అవుతుందని చెప్పారు నాగార్జున. సూట్ కేసు పట్టుకొని స్టేజ్ పైకి వచ్చిన అరియనాతో అందులో డబ్బు లేదని చెప్పారు నాగార్జున. అనిల్, సునీల్ లను నమ్మానంటూ.. దొంగ సచ్చినోళ్లారా అంటూ తిట్టేసింది. కాసేపు స్టేజ్ పై అరియనాతో ఫన్ చేశారు. ఫైనల్ గా సూట్ కేస్ లో రూ.10 లక్షలు ఉన్నట్లు చెప్పారు నాగార్జున. దీంతో అరియనా ఎగిరి గంతేసింది.  


Also Read: టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు ఔట్ - ఎవరంటే?