బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. వారికి లొకేషన్స్ పిన్స్ ఇచ్చి.. హౌస్ లో వారి ఫేవరెట్ ప్లేస్ గురించి చెప్పమని అడిగారు. ఆ తరువాత నామినేషన్స్ మొదలుపెట్టారు. హౌస్ మేట్స్ ముందు బెలూన్స్ పెట్టి అందులో రెడ్ వస్తే ఎలిమినేషన్ అని.. గ్రీన్ వస్తే సేఫ్ అని చెప్పారు. 


ఈ క్రమంలో అనిల్ రాథోడ్ బెలూన్ లో రెడ్ కలర్ బెలూన్స్ ఉండడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి వర్రీ లేదని.. బిగ్ బాస్ తనకొక మంచి ఆపర్చ్యునిటీ అని.. ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తరువాత మిగిలిన ఆరుగురితో 'థాంక్యూ అండ్ సారీ' గేమ్ ఆడించారు. 


ఎవరికి థాంక్స్ అండ్ ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారో చెప్పమని అడిగారు. దీంతో టాప్ 6 కంటెస్టెంట్స్ గేమ్ లో వారు ఎవరిని హర్ట్ చేశారో వాళ్లకు సారీ చెప్పారు. అలానే సపోర్ట్ చేసిన వాళ్లకు థాంక్స్ చెప్పారు. ఆ తరువాత స్టేజ్ పైకి నటుడు సత్యదేవ్ వచ్చారు. ఆయన నటించిన 'గాడ్సే' సినిమా రిలీజ్ అవుతుండంతో.. సినిమా గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. 
అనంతరం సత్యదేవ్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మిగిలిన హౌస్ మేట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ సత్యదేవ్ కి ఇచ్చారు. వీరితో బులెట్ టాస్క్ ఒకటి ఆడించి బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.