బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ కి వచ్చేసింది. ఈరోజు విన్నర్ ని అనౌన్స్ చేయడంతో షో ముగిసిపోతుంది. ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఏడుగురి ఫైనలిస్ట్ ల ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా కనిపించారు. మిత్రా ఫ్రెండ్ ను కాసేపు ఆటపట్టించారు నాగార్జున. 'మేజర్' సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్ స్టేజ్ పైకి వచ్చారు. 


అలానే నటుడు సత్యదేవ్ కూడా వచ్చారు. 'ఎఫ్3' టీమ్ హౌస్ లో సందడి చేసింది. మెహ్రీన్ స్టేజ్ పై డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అనిల్ రావిపూడి, సునీల్ లను డబ్బులున్న సూట్ కేస్ తో హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. అలానే అప్సరా రాణి, దక్షా నగార్కర్ ల డాన్స్ పెర్ఫార్మన్స్ ను ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. 


నిజానికి ఈరోజు ఫినాలే ఉంటుందనే విషయాన్ని కూడా పెద్దగా ప్రమోట్ చేయలేదు బిగ్ బాస్ టీమ్. షో ఫ్లాప్ కావడంతో గ్రాండ్ ఫినాలేకి కూడా పెద్దగా బజ్ రాలేదు. ఇక ఈ షోలో విన్నర్ గా బిందు మాధవి నిలుస్తుందని.. అఖిల్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సమాచారం. అదే నిజమైతే తొలిసారి బిగ్ బాస్ తెలుగు సీజన్లలో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచినట్లు అవుతుంది. మరేం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్ తో తేలిపోతుంది! 


Also Read: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్