Maharashtra Twin Brother Rape Case: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో సమాజం సిగ్గుపడే ఉదంతం వెలుగు చూసింది. ఒక కవల సోదరుడు తన మరదలితో (సోదరుడి భార్య) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కవలలు కావడం వల్ల ఇద్దరి రూపం ఒకేలా ఉండడంతో దాన్ని ఆసరాగా చేసుకుని అతను దాదాపు 6 నెలల పాటు తన వదినను లోబర్చుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు తన భర్త, అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పింది. అయితే, అందరూ నిందితుడికే వత్తాసు పలికారు. నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని చెప్పినట్లుగా బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం బాధితురాలి భర్త, బావ, అత్తపై కేసు నమోదు చేసి పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.


తన భర్తకు కవల సోదరుడైన తన బావ చేసిన ఈ పని గురించి బాధిత భార్య తన భర్తకు, అత్తగారికి చెప్పగా ఎవరూ ఆమెకు సహకరించలేదు. అందరూ ఈ అనైతిక చర్యను నైతికంగా చూసేందుకే ప్రయత్నించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


అసలేం జరిగిందంటే..
లాతూర్ జిల్లాలోని రింగ్‌రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడితో సమీప ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయికి గత ఏడాది వివాహం జరిగింది. ఈ యువకుడు కవలల్లో ఒకరు. కవల సోదరుడు కూడా అచ్చం అలాగే ఉంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని మరదలితో బావ అక్రమంగా శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆరు నెలల తర్వాత బాధితురాలికి ఈ విషయం అర్థమైంది. అనంతరం ఆ మహిళ తన భర్త, అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పింది. ఇంత సీరియస్ విషయాన్ని వారు పట్టించుకోకుండా సైలెంట్ గా తీసుకున్నారు. 


Also Read: BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత


ఇది విన్న తరువాత, తాను చాలా బాధపడినట్లుగా బాధితురాలు వాపోయింది. ఆ తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, బావ తన మరదలిని తీసుకురావడానికి ఆమె తల్లి ఇంటికి వెళ్లాడు. అయితే ఆ మహిళ తన బావతో రావడానికి నిరాకరించింది. ఆ తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను అర్థం చేసుకుని నచ్చచెప్పారు. మొత్తం జరిగిన సంగతిని ఆమె నుండి తెలుసుకున్నారు. ఈ సంఘటన విని, ఆమె తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే వారంతా వెళ్లి కుటుంబంలోని నలుగురిపై శివాజీ నగర్‌ లోని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. కవల సోదరులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: Tamilnadu Murder: దుప్పటి కప్పుకున్న భార్యపై భర్త కత్తి పోట్లు - ఆమె ముఖం చూసి షాక్!