Keerthi Suresh: టాలీవుడ్ నటి, మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను తెలుగు ప్రేక్షకులతో బాగా క్లోజ్ కాబట్టి. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ సినిమాలలో కూడా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లిస్టులలో ఒకరిగా నిలిచింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కాబోయే భర్త గురించి స్పందించింది. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కీర్తి సురేష్ సినీ ప్రపంచానికి చిన్నవయసులోనే అడుగు పెట్టింది. తల్లిదండ్రులు ఇండస్ట్రీకి చెందిన వారై కావటంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి. మొదట 2000 సంవత్సరంలో ‘ఫైలెట్స్’ అనే సినిమాతో బాలనటిగా పరిచయమైంది. అలా చిన్నవయసులోనే రెండు మూడు సినిమాలలో మలయాళం మూవీ గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.


ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. ఇక తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమాతో పరిచయమైంది. తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత నేను లోకల్ సినిమాలో నటించి మంచి అభిమానం సంపాదించుకుంది. ఇక మహానటి సావిత్రి సినిమాలో నటించి స్టార్ లిస్టులో స్థానం సంపాదించుకుంది.


ఇక మరికొన్ని సినిమాలలో చేయగా గత ఏడాది విడుదలైన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టేసింది. ఇక రీసెంట్ గా విడుదలైన దసరా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా బాగా మెప్పించింది. చాలా వరకు తెలుగులో మంచి మంచి సక్సెస్ లు అందుకుంది కీర్తి సురేష్. మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించిన కీర్తి ఇప్పుడు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుంటోంది.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో ఫోటో షూట్ లు చేయించుకున్న ఫోటోలను తెగ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.  గత కొన్ని రోజుల నుండి ఈమె పెళ్లి గురించి బాగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజులకు తనపై వస్తున్న వార్తలకు ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఓ వెబ్ సైట్‌లో తనపై వచ్చిన వార్తపై కీర్తి సురేష్ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. తన మిస్టరీ మ్యాన్ గురించి తానే స్వయంగా చెబుతానని వెల్లడించింది.






ఇక అందులో ఏమని తెలిపిందంటే.. ‘‘హ్హ హ్హ హ్హ.. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ను ఈ వార్తల్లోకి లాగక్కర్లేదు. నిజమైన మిస్టరీ మ్యాన్ ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటి వరకు చిల్ గా ఉండండి. ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదు’’ అని స్పందించింది. అంటే ఆ మిస్టరీ మాన్ ఎవరో కాదు తన కాబోయే వరుడుని ఉద్దేశిస్తూ.. తన పెళ్లి గురించి ఉద్దేశిస్తూ ఈ విధంగా స్పందించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ ట్వీట్ చూసిన జనాలు కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని నెట్టింట్లో బాగా ప్రచారం చేస్తున్నారు.


Also Read: Mem Famous: చివరికి కాకిని కూడా వదల్లేదుగా! ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఫన్నీ ముచ్చట్లు