Avasarala Srinivas's Lekkala Mastaru OTT Streaming On ETV Win: ఫ్యామిలీ, ఎమోషన్, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్‌తో 'కథా సుధ' పేరిట ప్రతి ఆదివారం ఓ సరికొత్త మూవీ 'ఈటీవీ విన్' ఓటీటీలోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వారం మరో మంచి కాన్సెప్ట్‌తో వచ్చేసింది.
'లెక్కల మాస్టారు' స్ట్రీమింగ్
ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'లెక్కల మాస్టారు'. ఈ మూవీ ఆదివారం నుంచి 'ఈటీవీ విన్'లో అందుబాటులోకి వచ్చింది. 'ఈ కథ ఓ ధైర్యం... స్ఫూర్తి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది సదరు ఓటీటీ సంస్థ. దేవరకొండ శ్రీకాంత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... అవసరాల శ్రీనివాస్ ఓ స్కూల్లో లెక్కల మాస్టారుగా కనిపించారు. ఆయనతో పాటే సహస్ర, సుమశ్రీ, సుప్రియ రత్నం, ప్రసాద్, ప్రియాంక కీలక పాత్రలు పోషించారు. రాకేశ్ చారీ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
మనలో చాలామందికి మ్యాథ్స్ అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండే ఉంటుంది. ఫార్ములాస్, ట్రిగనామెట్రీ వీటన్నింటినీ గుర్తుంచుకుని అప్లై చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కష్టమే. అసలు లైఫ్‌లో మ్యాథ్స్‌తో అవసరం ఏంటి?, ఫార్ములాస్ ఎందుకు నేర్చుకోవాలి? అనే కాన్సెప్ట్‌ను ఈ మూవీలో ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు దర్శకుడు. ఇక కథ విషయానికొస్తే... అనగనగా ఓ ఊరు. అందులో గవర్నమెంట్ స్కూల్లో చదివే ఓ అమ్మాయి. ఆమెకు లెక్కలంటే భయం. 'మ్యాథ్స్ ఎందుకు అంత కష్టంగా ఉంటుంది. అసలు మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలి?' అని ప్రశ్నించిన ఆ అమ్మాయికి లెక్కల మాస్టారు దారి చూపుతారు.
సులువుగా మ్యాథ్స్ అర్థం అయ్యేలా చెప్తారు. ఇదే క్రమంలో ఆమె పేరును ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు ఇస్తారు. మరోవైపు... అమ్మాయిలకు చదువులెందుకు? ఇంటి పని, వంట పని, సాధారణ పద్దులు రాసుకుంటే చాలు అనుకునే మనస్తత్వం ఆ అమ్మాయి తండ్రిది. ఇన్ని ఇబ్బందుల నడుమ ఆ అమ్మాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలో విజయం సాధించిందా? కష్టాలను అధిగమించి ఆమె సాధించింది ఏంటి? అనేది తెలియాలంటే ఇప్పుడే ఈటీవీ విన్‌లో లెక్కల మాస్టారు చూసేయండి. 'మన జీవితంలో గొప్ప విషయాలు రాత్రిపూట వచ్చే వర్షంలాగా నిశ్శబ్దంగా జరుగుతాయి.' అంటూ ట్రైలర్ ఫైనల్‌లో ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవల్.