Balakrishna's Akhanda 2 Big Business Digital Deal: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అవెయిటెడ్ మూవీ 'అఖండ 2'. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బాలయ్య లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో బాలయ్య అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది. అయితే, సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ అవుతుందని భావించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది.
బిగ్ బిజినెస్ డీల్
మూవీ రిలీజ్ వాయిదా పడినా బిగ్ బిజినెస్ డీల్‌తో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు టాప్ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ వంటి సంస్థ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే 'జియో హాట్ స్టార్' భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.85 కోట్లకు డీల్ ముగించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, సంక్రాంతి సెలవుల సీజన్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండేలా డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
రీసెంట్ బిగ్ డీల్
రూ.85 కోట్లకు మేకర్స్ డీల్ ఫిక్స్ చేయడంతో ఇదే ఇటీవల తెలుగు సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ అని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
Also Read: మరో హారర్ మూవీలో రష్మిక మందన్న? - దెయ్యం పాత్రలో భయపెట్టనున్న నేషనల్ క్రష్
రిలీజ్ ఎప్పుడు?
బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ 2' రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా... ఇటీవలే బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 25న రిలీజ్ ఉంటుందని భావించినా వాయిదా వేస్తూ మేకర్స్ షాక్ ఇచ్చారు. అయితే, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ నెలకొనగా... ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అంతకు మించి ఉండేలా 'అఖండ 2'ను ప్లాన్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ ఇతర పనులకు టైం పడుతున్నందున వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపడం సహా, యువతకు మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సీన్స్ బోయపాటి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.