Kartik Aaryan’s fan: కొంత‌మంది పిచ్చి అభిమానులు ఉంటారు. జీవితంలో ఒక్క‌సారైన త‌మ అభిమాన న‌టుడిని క‌ల‌వాల‌ని, వాళ్ల‌తో మాట్లాడాల‌ని, ఫొటో దిగాల‌ని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. కొంత‌మంది  కోరిక‌లు నెర‌వేరుతాయి. కొంత‌మందివి అలానే కోరిక‌లుగానే మిగిలిపోతాయి. కానీ, కొంద‌రు మాత్రం అలాకాదు.. క‌చ్చితంగా త‌మ కోరిక‌ను నెర‌వేర్చుకోవాల‌ని అనుకుంటారు. ఏదో ఒక‌టి చేసి వాళ్ల హీరోను క‌ల‌వాలి అనుకుంటారు. సాధిస్తారు. అలానే చేశాడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ అభిమాని కూడా. అత‌ని కోసం ఏకంగా ఝాన్సీ నుంచి ముంబై వ‌ర‌కు దాదాపు వెయ్యి కిలోమీట‌ర్లు సైకిల్ మీద చేరుకున్నాడు. అనుకున్న‌ది సాధించాడు. 


వీడియో వైర‌ల్.. 


ఝాన్సీకి చెందిన ఒక అబ్బాయికి కార్తిక్ ఆర్య‌న్ అంటే అభిమానం. దీంతో త‌న అభిమాన న‌టుడిని చూసేందుకు సైకిల్ పై బ‌య‌లుదేరాడు ఆ అబ్బాయి. 9 రోజుల పాటు.. వెయ్యి కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ.. ముంబైలోని కార్తిక్ ఆర్య‌న్ ఇంటికి చేరుకున్నాడు. అక్క‌డే ఆ హీరో ఇంటి ముందు నుంచున్నాడు. అది గ‌మ‌నించిన‌ ఆర్య‌న్.. అత‌ని ద‌గ్గ‌రికి వ‌చ్చి విష‌యం అడిగి తెలుసుకున్నాడు. ఆ త‌ర్వాత అత‌నికి ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చి అత‌నితో చాలాసేపు మాట్లాడాడు. ఇక ఆ అబ్బాయి కూడా చాలా సంతోషంగా కార్తిక్ ఆర్య‌న్ తో మాట్లాడాడు. త‌న అభిమాన హీరో కాళ్ల మీద ప‌డి.. ఆశీర్వాదం తీసుకున్నాడు. సెల్పీ దిగి మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆ అబ్బాయితో కార్తిక్ ఆర్య‌న్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడ‌టం క‌నిపించింది ఆ వీడియోలో. 






 


ఎంతో మంచి మ‌న‌సు.


ఈ వీడియో, న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  త‌మ అభిమాన న‌టుడి కోసం ఎంత సాహ‌సం చేశాడు అంటూ కొంత‌మంది కామెంట్లు పెడుతున్నారు. కార్తిక్ ఆర్య‌న్ ఫ్యాన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అంటూ త‌మ అభిమాన హీరో వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. 


కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన 'చందు ఛాంపియ‌న్' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'ఆషికీ - 3'లో త్రిప్తీ దిమ్రీతో క‌లిసి న‌టిస్తుండ‌గా.. కియారా అద్వానీతో 'స‌త్య ప్రేమ్ కి క‌థ'లో కూడా న‌టిస్తున్నారు ఆయ‌న‌.


తెలుగులో సూప‌ర్ హిట్ అయిన బ‌న్నీ మూవీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాని ‘షెహజాదా’ పేరుతో రీమేక్ చేశారు. కాని అనుకున్న  స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య మూవీని విడుదల చేశారు మేకర్స్. అయితే తెలుగులో ఆకట్టుకున్నంతగా ఈ సినిమా హిందీలో మెప్పించలేకపోయింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్ స్టైల్ తో సహా మక్కీకి మక్కీ దించేశారనే టాక్ రావడంతో తొలిరోజే ఈ సినిమా కలెక్షన్లకు గండి పడింది. దీంతో మూవీ అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.


Also Read: ‘మ‌సూద’ ప్రీక్వెల్ వస్తోంది - ప్రొడ్యూస‌ర్ రాహుల్ యాద‌వ్ న‌క్కా