Deadpool & Wolverine Teaser Out: 2024లో వెండితెరపై సందడి చేయబోతున్న మార్వెరల్ మూవీ ‘డెడ్‌పూల్ 3’. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్(MCU)నుంచి ఈ ఏడాది ఒకే ఒక్క సినిమా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తున్న ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ టీజర్


ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించాయి. తాజాగా  ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’  మూవీ రాబోతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వేడ్ విల్సన్‌గా ర్యాన్ రేనాల్డ్స్,  వుల్వరైన్ పాత్రలో హ్యూ జాక్‌మన్ గా నటించారు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.  ట్రైలర్ ప్రారంభంలో ర్యాన్ రేనాల్డ్స్ తన సన్నిహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంతలోగా కొందరు సాయుధులు వచ్చి ఆ ఇంటి డోర్ కొడతారు. బయటకు వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ ను హ్యూ జాక్‌మన్ టీమ్ కిడ్నాప్ చేసి, తన ప్రయోగశాలకు తీసుకెళ్తారు. అక్కడ హ్యూ జాక్‌మన్, ర్యాన్ రేనాల్డ్స్ గతం గురించి వివరిస్తారు.


ఈ సినిమాతో మార్కెల్ మూవీస్ దశ పూర్తిగా మలుపు తిరగబోతోందంటారు ర్యాన్ రేనాల్డ్స్. తానే మార్వెల్ మహరాజుగా మారబోతున్నట్లు చెప్తాడు. అదే సమయంలో ర్యాన్ రేనాల్డ్స్ మళ్లీ మార్వెల్ సూట్ ధరించి సూపర్ హీరోగా మారుతాడు. హ్యూ జాక్‌మన్ టీమ్ ఎత్తులను చిత్తు చేసే క్రమంలో కనీవినీ ఎరుగని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటాడు.



జూలై 26న ప్రేక్షకుల ముందుకు ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’  


షాన్ లెవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక ‘డెడ్‌పూల్ & వుల్వరైన్‌’ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజరే ఈ రేంజిలో ఉంటే, ట్రైలర్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని అభిమానులు భావిస్తున్నారు.



Also Read: బుల్లితెరపై రామ్ ర్యాంపేజ్.. డిజాస్టర్ సినిమాలకూ డీసెంట్ టీఆర్పీ!



ఈ సినిమా జూలైలో విడుదల కానున్నన నేపథ్యంలో జూన్ చివరి వారంలో ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.






Read Also: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్