Kareena Kapoor: తైమూర్‌ అలా అనగానే మనసు చివుక్కుమంది - కళ్లల్లో నీళ్లు తిరిగాయి

Kareena Kapoor About Son Taimur: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్ధాలుగా బి-టౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

Continues below advertisement

Kareena Kapoor says her elder son Taimur complains: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్ధాలుగా బి-టౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికీ బి-టౌన్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల క్రూ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. అయితే ఇప్పుడు కరీనా మరో అరుదైన ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కరీనా యునిసెఫ్ (యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ ఎమర్జెన్సీ ఫండ్‌)జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.  

Continues below advertisement

ఈ అరుదైన ఘనత అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కరీనా తన పెద్ద కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ ఈవెంట్‌లో పిల్లల మనస్తత్త్వం గురించి చెబుతూ తైమూర్‌ నుంచి తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. పిల్లలు తండ్రి చేసే పని గురించే కాదని, తల్లి చేసే పని గురించి కూడా ఆలోచిస్తారన్నారు. "తన వర్క్‌, బిజీ షెడ్యూల్‌ వల్ల ఒక్కొసారి పిల్లలకు టైం కెటాయించడం కదురదు. తరచూ విదేశాలకు వెళ్లాల్సి కూడా వస్తుంది. దాంతో పిల్లలు మనం ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచిస్తారు. ఒక రోజు తైమూర్‌ స్కూల్‌కి హాలీడే. నాతో కలిసి టైం స్పెండ్‌ చేయాలనుకున్నాడు.

ఎప్పుడు పనేనా అన్నాడు..

కానీ, ఆ రోజు నాకు పని ఉంది. తైమూర్‌ తనతో ఉండమని అడగితే నాకు పని ఉందని చెప్పి వెళ్లిపోయాను. దీంతో ఓ రోజు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు నా పెద్ద కుమారుడు తైమూర్‌ 'నువ్వు ఎప్పుడు పనీ పనీ అంటూ ఎప్పుడూ దుబాయ్‌, ఢిల్లీ వెళ్తావు. నాకు నీతో ఉండాలని ఉందమ్మా' అన్నాడు. అలా అనడంతో ఒక్కసారిగా నా మనసు భారంగా అనిపించింది.కళ్లల్లో నీళ్లు తిరగాయి.. కానీ, వర్క్‌ కూడా ముఖ్యం కదా వెళ్లక తప్పదు అని చెప్పాను" అంటూ కరీనా చెప్పుకొచ్చింది. కానీ, అప్పుడు తైమూర్‌కి ఓ మాట ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. తైమూర్‌ అలా అనగానే త్వరగా వచ్చేస్తానని, నీకే సమయం కేటాయిస్తాను అని చెప్పాను. ఎక్కువ సమయం నీతోనే ఉంటానని, నీతో ఆడుకుంటానని నచ్చచెప్పాను.

అయితే తల్లిగా నేను అది నెరవేస్తాను కూడా, అది నా బాధ్యత అని కరీనా అన్నారు. అలా తల్లిదండ్రులు పిల్లలకు వివరిస్తే వారు వాళ్లని నిర్లక్ష్యం చేస్తున్నారని భావనలో ఉండరు. అర్థం చేసుకుంటారు. అమ్మ-నాన్న ఇద్దరు వర్క్‌ చేసుకుని ఇంటికి వచ్చేస్తారని తైమూర్‌ అర్థం చేసుకుంటాడని" పేర్కొంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారంది. అందుకే తన భర్త సైఫ్‌ కూడా అదే చెబుతుంటారని, పిల్లల ముందు మనం ప్రేమగా, అప్యాయంగా ఉండాలంటారు. పిల్లలతో కూడా అంతే అప్యాయంగా ఉండాలంటారు. అందుకే మాలాగే మా పిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌర‌వంగా మెదులుతారని కరీనా చెప్పుకొచ్చింది. 

Also Read: సింపతీ కోసమే వితిక అబద్దం చెప్పిందా? అప్పుడలా ఎందుకు చెప్పావంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్!

Continues below advertisement
Sponsored Links by Taboola