Meghasandesam Serial Today Episode: గగన్‌, భూమిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్తాడు. వాళ్లను ఫాలో అయిన నక్షత్ర వాళ్లకు దూరంగా కూర్చుని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో గగన్‌ ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. అది గమనించిన నక్షత్ర వెంటనే భూమిని ఎలాగైనా అవమానించాలనుకుంటుంది. అందుకోసం వెయిటర్‌ను పిలిచి డబ్బులు ఇస్తుంది.

వెయిటర్‌: ఏం చేయాలి మేడం.

నక్షత్ర: మీ రెస్టారెంట్‌లో సలసల కాగే సూప్‌ ఏదైనా పర్వాలేదు. ఫింగర్‌ బౌల్‌లో తీసుకొచ్చి అక్కడ పెట్టి

వెయిటర్‌: మేడం రిస్క్‌ అవుతుందేమో..

నక్షత్ర: రిస్క్‌ వస్తే నేను చూసుకుంటాను.

వెయిటర్‌: ఓకే మేడం..

నక్షత్ర: ఇప్పడు ఉంటుంది అసలు కథ.. పింగర్‌ బౌల్‌కు సూప్‌కు తేడా తెలియని ఒక వెర్రి బాగుల దాని ఆర్థనాథాలు మనం వినబోతున్నాం.

వెయిటర్‌ ఫింగర్‌ బౌల్‌ తీసుకెళ్లి భూమి టేబుల్‌ దగ్గర పెడతాడు.

భూమి: ఏంటిది..?

వెయిటర్‌: మీకే మేడం..

 అని చెప్పి వెళ్లిపోతాడు. భూమి పక్క టేబుల్‌లో ఒకామె చేతులు క్లీన్‌ చేసుకోవడం చూసి ఒహో అలా చేతులు కడుక్కోవడానికా..? అనుకుంటూ సూప్‌లో చేయి పెట్టి గట్టిగా అరుస్తుంది. చేయి పట్టుకుని బాధపడుతుంది. దూరం నుంచి గమనించిన గగన్‌ పరుగెత్తుకొస్తాడు.

గగన్‌: ఏమైంది.. భూమి.. ఐస్‌ క్యూబ్‌..

అంటూ పిలుస్తాడు. చుట్టు ఉన్న వాళ్లు అందరూ నవ్వుతుంటారు.

గగన్‌: షటప్‌ ఎందుకు నవ్వుతున్నారు. ఈ ప్లేస్‌ తనకు కొత్త ఒకటి అనుకుని ఇంకో దాంట్లో చేయి పెట్టింది. మీరేంటి ఇలాంటి రెస్టారెంట్‌ గురించి పూర్తిగా తెలుసుకున్నారా.. జాలి పడాల్సిన చోట జాలిగా నవ్వాలని ఎలా అనిపించింది. భూమి.. చేయి ఇక్కడ పెట్టు

అంటూ ఐస్‌క్యూబ్‌ తో భూమిని చేయికి కూల్‌ చేస్తుంటాడు. దూరం నుంచి గమనిస్తున్న నక్షత్ర కుళ్లుతో చచ్చిపోతుంది.

నక్షత్ర ఫ్రెండ్‌: నువ్వు వేసిన నీకు కాదు అక్కడ వర్కవుట్‌ అయింది. గగన్‌ షేమ్‌ ఫీల్‌ అవ్వలేదే..? అందరి నోళ్లు మూయించి తన  ప్రేమను మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. చూడు భూమిని ఎలా సర్వీస్‌ చేస్తున్నాడో. లవర్‌ అంటే తనే.. నీ లవర్‌ తను కాకపోవడం నీ బ్యాడ్‌ లక్‌..

అంటూ నక్షత్రకు గడ్డి పెడుతుంది. మరోవైపు దూరం నుంచి అంతా గమనించిన చెర్రి వెయిటర్‌ ను పిలిచి డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టు చేస్తావని అంటాడు. దీంతో వెయిటర్‌ నక్షత్రకు బర్గర్‌ ఇచ్చి వెళ్తాడు. అది తిని కారంతో అరుస్తుంది నక్షత్ర.

భూమి: ఇది ఇక్కడికి కూడా వచ్చేసిందా..?

నక్షత్ర: రేయ్‌ ఇడియట్‌ బర్గర్‌ తెచ్చావా..? చిల్లి పౌడర్‌ తెచ్చావా..?

వెయిటర్‌: మేడం మీరు స్పైషీగా తింటారని అదిగో మీ పియాన్సీయే కలిపారు మేడం.

గగన్‌: నేను ఉన్న దగ్గరకు నక్షత్ర వస్తే.. నక్షత్ర ఉన్నదగ్గరకు చెర్రి వచ్చేస్తున్నాడు. అయితే వాడు నక్షత్రకు బాగా కనెక్ట్‌ అయిపోయాడు.

భూమి: అయ్యో పాపం పొరపాటున నక్షత్ర కూడా చెర్రికి కనెక్ట్ అయితే చెర్రి అన్యాయం అయిపోతాడు.

గగన్‌: వాణ్ని నువ్వు తక్కువ అంచనా వేయకు. వాడిలో కూడా చిన్నసైజు హీరో ఉన్నాడు. అనుకున్నాడంటే నక్షత్రను కూడా తన కంట్రోల్‌ లోకి తెచ్చుకుంటాడు.

అని చెప్తుండగానే రెస్టారెంట్‌లో మైక్‌ అనౌన్స్‌ మెంట్‌ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ శోభాచంద్ర గారి శిష్యురాలు తన నాట్యాన్ని ప్రదర్శిస్తారు అని చెప్తారు. భూమి ఆసక్తిగా చూస్తుంది. శోభ చనిపోయినప్పుడు డాన్స్‌ చేయకుండా వెళ్లిపోయిన వ్యక్తి వచ్చి డాన్స్‌ చేస్తుంది. భూమి కోపంగా చూస్తుంది.

గగన్‌: ఏమైంది భూమి.. అలా చూస్తున్నావు.

భూమి: మా అమ్మ చనిపోయినప్పుడు ఈవిడే డాన్స్‌ చేసింది. ( అంటూ జరిగింది మొత్తం చెప్తుంది.)

గగన్‌: అంటే మీ అమ్మ చనిపోవడానిక కారణం ఈవిడేనా..?

భూమి: నువ్వు శోభాచంద్ర శిష్యురాలివా..?

అంటూ ప్రశ్నించడంతో ఆవిడ కోపంగా భూమిని తిడుతుంది. నన్నే నాట్యం గురించి ప్రశ్నిస్తావా..? అసలు నీకేం తెలసని నాట్యం గురించి అంటూ రెచ్చగొట్టడంతో భూమి వెళ్లి నాట్యం చేస్తుంది. డాన్స్‌లో ఆవిడను ఓడిస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!