Chinni Serial Today Episode సరళ కావేరిని తాళి, పారాణి గురించి ప్రశ్నిస్తుంది. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చావా ఏంటి అని అడుగుతుంది. దాంతో కావేరి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటానా.. స్కూల్‌లో ప్రోగ్రాంలో నేను పెళ్లి కూతురి గెటప్ వేశాను టైం అయిందని ఇలా వచ్చేశాను అంటుంది. దాంతో సరళ అవునా పైకి వెళ్లి ఈ గెటప్ తీసేసి ఉషలా రా అని చెప్తుంది. 

మహిని తీసుకొని ప్రోగ్రస్ కార్డ్ తీసుకోవడానికి దేవేంద్ర వర్మ, నాగవల్లి బయల్దేరుతారు. ఫస్ట్‌ ర్యాంక్ వస్తుంది కదా అని దేవా మహిని అడిగితే నేను చిన్ని మా ఇద్దరిలో ఒకరికి ఫస్ట్ వస్తే మరొకరికి సెకండ్ వస్తుంది అంటాడు. నాగవల్లి మనసులో ఈ చిన్ని మాకే అనుకున్నా ఈ విధంగా మహికి కూడా శత్రువునా అనుకుంటుంది. ఇక దారిలో మహి కారు ఆపమని చిన్ని, చందు వాళ్ల కోసం చాక్లెట్స్ తీసుకుంటా అని ఆగుతాడు. మహిని తీసుకొని నాగవల్లి షాప్‌కి వెళ్తుంది. మహి చాలా చాక్లెట్స్ తీసుకుంటాడు. ఆ గిఫ్ట్ షాప్‌లో ఓ గడియారం చూసి అది చిన్నికి ఇవ్వాలి అనుకుంటాడు. నాగవల్లికి ఆ గిఫ్ట్ కొనమని అంటే ఎవరి కోసం అని అడుగుతుంది. చిన్ని కోసం అని అనగానే కోపంతో ఊగిపోతుంది. ఆ గడియారం కింద పడేయబోతే మహి పట్టుకుంటాడు. 

కావేరి, బాలరాజు చిన్నిని తీసుకొని స్కూల్‌కి వస్తారు. చిన్ని చందుని చూసి హ్యాపీగా ఫీలై పరుగులు తీస్తుంది. అత్తయ్య లోహిత బాగున్నారా అని అడుగుతుంది. చందు అందరూ బాగున్నారు అని అంటాడు. బాలరాజుని చూసి మామయ్య బాగున్నావా అంటే ఇంతలో లోహిత వచ్చి నాన్నని చంపిన వాళ్లతో మాట్లాడటానికి సిగ్గు లేదా అంటుంది. దానికి బాలరాజు నువ్వు పొరపాటు పడుతున్నావ్ అమ్మా నేను చంపలేదు అంటే నువ్వే చంపావ్ అని అంటుంది. అన్నయ్యా ఇలాంటి వాళ్లకి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పి వెళ్లిపోతుంది. చందు బాలతో మామయ్య దాని మాటలు నువ్వు పట్టించుకోకు నువ్వు నిర్దోషి అని మేం అంతా నమ్ముతున్నాం అని అంటాడు.

బాల చందుని పట్టుకొని ఏడుస్తూ మీ ముగ్గురు కూడా నన్ను నమ్మకపోతే నేను బతికి ఉండే వాడిని కాదేమో అని అంటాడు. ఇక చిన్ని కావేరితో రిపోర్ట్ కార్డు ఇచ్చినప్పుడు అమ్మలా నువ్వు ఉండాలి  అంటుంది. కావేరి సరే అని ప్రిన్సిపల్‌ని కలవడానికి వెళ్తుంది. ఇక చందు చిన్నతో నువ్వు రిపోర్ట్ కార్డు తీసుకునేటప్పుడు మీ అమ్మానాన్నలు కలిసి ఉండటం ఇదే మొదటి సారి కదా అంటాడు. ప్రిన్సిపల్ మేడం కావేరితో చిన్నికి ఫస్ట్‌ క్లాస్ వచ్చిందని అంటుంది. కావేరి చాలా సంతోషపడుతుంది. ఇక కావేరి చిన్నికి ప్రోగ్రస్ కార్డు ఇచ్చినప్పుడు బాలరాజుతో పాటు తాను ఉంటాను అంటుంది. మీ ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉండాలి అని ప్రిన్సిపల్ మేడం అంటే అలా జరగాలి అంటే మాకు పట్టిన పీడ పోవాలి అంటుంది.

మహి వాళ్లు స్కూల్‌కి వస్తారు. చందుని మహి వాళ్లు కలుస్తారు. చందుకి ఇష్టమైన చాక్లెట్స్ మహి ఇస్తాడు. అందరికీ చాక్లెట్స్ ఇస్తాను అని మహి చెప్తాడు. ఇక చిన్నికి ప్రిన్సిపల్ మేడం కార్డు ఇస్తుంది. కావేరి, చిన్ని, బాలరాజులకు ఫోటోలు తీస్తుంది. ఇక సెల్ఫీ తీసుకుంటారు. తనని ఉషగా ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. బాలరాజు, కావేరి ఇద్దరూ తమకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని మేడంకి దండం పెడతారు. చేయని నేరానికి మీరు బలి అయిపోయారు నాకు బాధగా ఉందని అంటుంది. ఇక చిన్ని మహిని కలుస్తుంది. ర్యాంక్ ఏంటి అని మహి అడిగితే చిన్ని సస్పెన్స్ అని అంటుంది. మహి వాళ్లు లోపలికి వెళ్తారు. ఇక చందు చిన్ని దగ్గరకు వచ్చి చిన్నికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాక్లెట్ ఇస్తాడు. 

మహికి కూడా ఫస్ట్‌ ర్యాంక్ వచ్చిందని టీచర్ చెప్తారు. ఇక చిన్నికి, మహికి ఇద్దరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు దేవా, వల్లి రగిలిపోతారు. దేవా బయటకు రాగానే కావేరి, బాలరాజు తల మీద పడిన దుమ్ము దులుపుతుంది. అది చూసి పెళ్లి అవగానే ఒక్కటైపోయారు అనుకుంటాడు. చిన్ని, కావేరి, బాలరాజుల సంతోషం చూసి కుళ్లుకుంటాడు. బాలరాజు ఒంటరిగా ఉంటే సతీసమేతంగా వచ్చావా అంటాడు. దానికి బాలరాజు నీకొడుకు కార్డు తీసుకోవడానికి సతీ సమేతంగా వచ్చే అదృష్టం నీ భార్యని చంపేసి నువ్వే పోగొట్టుకున్నావ్ అంటాడు.ఇద్దరూ అరుచుకుంటాడు. సత్యంబాబుతో పాటు నీ భార్య పార్వతిని కూడా నువ్వే చంపావని నిరూపిస్తాను అని బాలరాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్‌..!