Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు కనిపించడం లేదని ఇంట్లో అందరూ వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. అనామిక, పిల్లలు భాగీ కంగారుపడుతుంటారు. వెంటనే భాగీ ఫోన్ చేసి అమర్ కు విషయం చెప్తుంది. రణవీర్ గురించి తెలుసుకోవడానికి రణవీర్ ఇంటికి వెళ్లిన అమర్ కంగారు పడతాడు. సీసీటీవీ చెక్ చేయమని చెప్తాడు. చెక్ చేశానని అంజు ఒక్కతే బయటకు వెల్లడం ఉందని భాగీ చెప్పడంతో నా అనుమానమే నిజం అయింది రాథోడ్ అంటూ రణవీర్ మీద కోప్పడతాడు అమర్. తర్వాత అనామిక కంగారుగా గార్డెన్ లోకి వెళ్లి గుప్తను పిలుస్తుంది. గుప్త వస్తాడు.
అనామిక: గుప్త గారు ఎక్కడికి వెళ్లిపోయారు
గుప్త: ఇచ్చటనే ఉన్నాను. ఏంటి నీ పిల్ల పిచ్చుక కనిపించడం లేదని కంగారు పడుతున్నావా..?
అనామిక: ఓ అయితే పక్కా సమాచారంతోనే వచ్చారా..? అయితే అంజు ఎక్కడికి వెళ్లింది.. అసలు ఏం జరుగుతుంది గుప్త గారు
గుప్త: ఆ పిల్ల పిచ్చుక చేరాల్సిన చోటికే చేరింది
అనామిక: అంటే ఎక్కడికి వెళ్లింది
గుప్త: తన జన్మస్థానమునకు వెళ్లింది. నీవు ఎచ్చట నుంచి తీసుకు వచ్చితివో అచ్చటికే వెళ్లింది
అనామిక: కోల్‌కతా వెళ్లిందా..?అంటే రణవీర్ తీసుకెళ్లిపోయాడా..? అసలు ఏం జరుగుతుంది గుప్త గారు. అంజలి ఎందుకు రణవీర్‌తో కొల్ కతా వెళ్లింది
గుప్త: కన్న తండ్రి స్వార్థమునకు.. కన్న తల్లి మోసమును బలి అయినది
అనామిక: ఏం మాట్లాడుతున్నారు మీరు.. వాళ్లిద్దరు అంజలిని ఏం చేయబోతున్నారు.. నా పాపకు ఏ ప్రమాదం లేదు కదా
గుప్త: జరగబోయేది లలాట లికితం.. నువ్వెంత బాధపడిననూ జరగవలసినదే జరుగును. కన్న ప్రేమ ప్రాణములు కోరుతున్నది. పెంచిన ప్రేమ ప్రాణములను పణంగా పెట్టి అయిననూ ఆ పిల్లపిచ్చుకను కాపాడవలెనని చూచుతున్నది. ఈ వింత కథను చూసి ఏమి అనవలెనో తెలియటలేదు
అనామిక: మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది గుప్త గారు ఏం జరగబోతుంది. అంజుకు ఏం కాదని మాత్రం చెప్పండి ఫ్లీజ్
గుప్త: ఏమియూ కాదు. సంతోషమేనా…
అనామిక: అమ్మా చాలు అది చాలు గుప్త గారు నా అంజుకు ఏమీ కాకుండా ఉంటే అంతే చాలు. ఆయన వెళ్లి రణవీర్‌ను ఏం చేసైనా నా అంజును తీసుకొస్తారు.
గుప్త నవ్వుతాడు.
అనామిక: ఏమైంది గుప్త గారు ఎందుకు నవ్వుతారు
గుప్త: జరగబోవునది ఎవరు తలచెదరు. తలచినది ఎటుల జరుగును
అనామిక: కంగారుగా ఫ్లీజ్ గుప్త గారు అసలేం జరగబోతుంది చెప్పండి
గుప్త: నీ పతి దేవుడు వెతుకుతూ వెళ్తున్న సమాధానములు అతగాడికి దొరుకును. అవి ఈ ఇంటి నుంచే వెళ్లును. సమస్య ఇచ్చటనే ఉన్నది. సమాధానం ఇచ్చటనే ఉన్నది. నీ పతి దేవునకు సమాధానం అర్థం అయిన రోజున సమస్యలన్నీయు తొలగిపోవును
అనామిక: మరి అది..
గుప్త: కానీ ఆ దినము ఎప్పుడు వచ్చునో నేను చెప్పలేను. దగ్గరలో ఉన్నదని మాత్రం చెప్పగలను. బాలిక పౌర్ణమి నాడు నువ్వు ఈ దేహమును వదిలి శాశ్వతంగా నువ్వు ఇచ్చట నుంచి మా లోకమునకు వెళ్లినప్పుడు నీకు ఈ బాధ ఉండరాదనే ఈ నిజం చెప్పితిని జరగబోవునది వీక్షించుటకు వేచి ఉండుము
చెప్పి గుప్త మాయం అయిపోతాడు. తర్వాత అనామిక, భాగీ రూంలో అంజు గురించి ఆలోచిస్తుంటారు. భాగీ ఒక ఫైల్ లో రణవీర్ ఫోటో చూసి షాక్ అవుతుంది. రణవీర్ మెడలో ఉన్న చైన్ అంజు మెడలో ఉన్న చైన్ ఒకేలా ఉన్నాయని చూసి అంజు రణవీర్ కూతురే అని అనుమానిస్తుంది. అదే విషయం అమర్‌కు ఫోన్ చేసి చెప్తుంది. అమర్ షాక్ అవుతాడు. ఇంతలో అక్కడికి రణవీర్ అంజును తీసుకుని వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!