Darshan Arrested: కన్నడ కథానాయకుడు, టాప్ స్టార్ దర్శన్ (Kannada Actor Darshan) పోలీసుల అదుపులో ఉన్నారా? అంటే... 'అవును' అని కర్ణాటక మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఒక మర్డర్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారనే వార్త సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


దర్శన్ కళ్ల ముందు హత్య జరిగిందా?మైసూరులో దర్శన్ (Why Darsshan was arrested)ను కర్ణాటక రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. రేణుకా స్వామి మర్డర్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.


నటి పవిత్ర గౌడ (Actress Pavithra Gowda)కు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించారని రేణుకా స్వామి (Renuka Swamy) అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అతను అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలారు. ఆయన మరణం వెనుక దర్శన్ ఉన్నారనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కళ్ల ముందు గ్యారేజీలో హత్య జరిగిందని, ఆ తర్వాత డెడ్ బాడీని డ్రైనేజీలో పారేశారని కన్నడ గుసగుస.






దర్శన్ జీవితం... వివాదాల మాయం!
కన్నడనాట టాప్ స్టార్లలో దర్శన్ ఒకరు. కేవలం కన్నడలో రిలీజ్ అయిన ఆయన సినిమాలు వంద కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంటున్నాయంటే ఆయన మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న ఆయన పర్సనల్ లైఫ్ పలుమార్లు వివాదాల్లో నిలిచింది.


Also Readదీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెగులు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్


రేణుకా స్వామి హత్య కేసు కంటే ముందు... గతేడాది ఫారెస్ట్ అధికారులు ఆయన వ్యవసాయ క్షేత్రం మీద రైడ్ చేశారు. చట్టవ్యతిరేకంగా అటవీ పక్షులను ఆయన పెంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తనను బెదిరించారని 2022లో కన్నడ నిర్మాత భరత్ పోలీసులకు దర్శన్ మీద ఫిర్యాదు చేశారు. మైసూరులోని ఒక హోటల్లో వెయిటర్ ను కించపరిచిన ఆరోపణలో 2021లో వచ్చాయి. తన భర్త ప్రవర్తన బాలేదని, తన మీద శారీరక దాడికి పాల్పడటం, కొట్టడం వంటివి చేశాడని దర్శన్ భార్య 2016లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. దానికి ముందు 2011లో గృహ హింస చట్టం కింద దర్శన్ భార్య కేసు పెట్టడంలో 14 రోజుల పాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


Also Readఅమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?