Ravi Teja new film launch: మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది. తన విలక్షణ నటనతో ఆయన ఎంతో మందిని ఆకట్టుకున్నారు. రవితేజతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఫిల్మ్ తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది బ్లాక్ బస్టర్ 'ధమాకా' చూపించింది. అటువంటి విలక్షణ, పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో మాస్ మహారాజాను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటువంటి చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభించారు.


పూజతో మొదలైన రవితేజ 75వ సినిమా!
నటుడిగా మాస్ మహారాజా రవితేజ ప్రయాణంలో 75వ మైలురాయి (Ravi Teja 75th Film) చేరుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఆయనో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన కెరీర్‌లో 75వ సినిమా అది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నేడు పూజతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్ ఇవ్వగా... భాను బోగవరపు దర్శకత్వం వహించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.


ఉగాది సందర్భంగా రవితేజ 75వ సినిమాను అనౌన్స్ చేశారు. 'ధూమ్ ధామ్ దావత్' గ్యారంటీ అని పేర్కొన్నారు. అప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి (RT 75 Release Date) సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి విడుదల గురించి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తామని స్పష్టం చేశారు.


Also Readదీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెగులు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్






రవితేజ సరసన కథానాయికగా శ్రీ లీల!
రవితేజ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి మాటల రచయితగా, 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ ప్లే రచయితగా పని చేశారు భాను బోగవరపు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'NBK109'కి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీ లీల కథానాయికగా ఎంపిక అయ్యారు. 'ధమాకా' తర్వాత మరోసారి రవితేజ సినిమాకు పూర్తి స్థాయిలో భీమ్స్ సంగీతం అందిస్తున్న సినిమా కూడా ఇదే!


'ధమాకా' సినిమాలో రవితేజ, శ్రీ లీల జోడీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. హిట్ తర్వాత వాళ్లిద్దరూ చేస్తున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో, దాని మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో శ్రీ లీల 'గుంటూరు కారం', 'ఆదికేశవ' సినిమాలు చేశారు. నిర్మాణ సంస్థలో ఇది హ్యాట్రిక్ సినిమా అని చెప్పవచ్చు.


Also Readకమల్ తప్ప ఇంకొకరు చేయగలరా? 'కల్కి'లో ఆయన్ను ఎంత మంది గుర్తు పట్టారు?


RT 75 Cast And Crew: రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కూర్పు: జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి, సంగీతం: భీమ్స్, దర్శకత్వం: భాను భోగవరపు, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య.