టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో 'దిల్' రాజు (Dil Raju) ఒకరు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కుమార్తె హన్షిత, సోదరుని కుమారుడు హర్షిత్ రెడ్డి ప్రొడ్యూసర్లు అయ్యారు. అయితే, దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ మాత్రం హీరో అయ్యాడు. ఆ ఫ్యామిలీ నుంచి యాక్టింగ్‌లో అడుగు పెట్టింది అతడొక్కడే. ఇప్పుడు ఇంకొకరు వస్తున్నారు. అవును... 'దిల్' రాజు ఫ్యామిలీ నుంచి మరొక హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. 


హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా...
'దిల్' రాజు బంధువు, 'బలగం' నిర్మాతల్లో ఒకరైన హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ (Suman Tej Actor) హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సీతా కళ్యాణ వైభోగమే' (Seetha Kalyana Vaibhogame Movie). ఈ సినిమాలో గరీమా చౌహన్ హీరోయిన్. సతీష్ పరమవేద దర్శకత్వం వహించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ప్రొడ్యూస్ చేశారు. ఈ నెల జూన్ 21న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హర్షిత్ రెడ్డి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.


'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ విడుదల చేశాక హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ... ''నాకు 'ఓ మై ఫ్రెండ్' సమయంలో దర్శకుడు సతీష్ పరమవేదతో పరిచయం ఏర్పడింది. ఈ సినిమా ఐడియా ఏడాదిన్నర క్రితం చెప్పాడు. కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నాని చెప్పాడు. సుమన్ తేజ్ మొదటి చిత్రమిది. అతడితో పాటు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. మూవీ మంచి హిట్ కావాలి'' అని అన్నారు. తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని చాటే విధంగా టైటిల్ ఉందని, ట్రైలర్ బావుందని, సినిమా మంచి విజయం సాధించాలని బెక్కం వేణుగోపాల్ ఆకాంక్షించారు.


Also Read: దీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెగులు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్



హర్షిత్ అన్నకు థాంక్స్... నైంటీస్ కిడ్స్ ఎంజాయ్ చేస్తారు!
'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చింది హర్షిత్ రెడ్డి అన్నకు థాంక్స్ అని సుమన్ తేజ్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమా నైంటీస్ కిడ్స్ అందరికీ నచ్చుతుంది. తొలుత ఒక సినిమా స్టార్ట్ చేసినా ఈ జర్నీలో మేం రెండు మూవీస్ చేశాం. అవి రిలీజుకు రెడీగా ఉన్నాయి. మాకు సపోర్ట్ చేసిన నీరూస్ సంస్థకు థాంక్స్'' అని చెప్పారు. 


దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ... ''ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది. హర్షిత్ రెడ్డి గారు 'బలగం' సినిమాతో మా అందరికీ బలాన్ని ఇచ్చారు. మా సినిమాకు చరణ్ అర్జున్ మంచి పాటలు ఇవ్వగా... నిర్మాత యుగంధర్ గారు రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేశారు. సకుటుంబ సమేతంగా చూసేలా సినిమా ఉంటుంది. జూన్ 21న సినిమా విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు. ప్రేక్షకులంతా సినిమాను థియేటర్లలో చూడాలని నిర్మాత రాచాల యుగంధర్ రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో గగన్ విహారి, గరిమ చౌహాన్, చరణ్ అర్జున్, నీరూస్ ప్రతినిధి ఆసిం, దేవరాజ్ పాలమూరి, నటుడు రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Also Readకమల్ తప్ప ఇంకొకరు చేయగలరా? 'కల్కి'లో ఆయన్ను ఎంత మంది గుర్తు పట్టారు?