Kangana Ranaut Slapped: గత కొంతకాలంగా కంగనా రనౌత్ సినిమాలను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీ అయిపోయింది. అలాంటి కంగనాకు తాజాగా చేదు అనుభవం ఎదురయ్యింది. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఒక మహిళా అధికారి కంగనాపై చేయి చేసుకున్నారు. ఓ వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది అనేదానిపై క్లారిటీ ఇవ్వడానికి కంగనా స్వయంగా ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు.


సెక్యూరిటీతో గొడవ..


కంగనా రనౌత్.. ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యింది. అక్కడ సెక్యూరిటీ చెక్ సమయంలో తన ఫోన్‌ను ట్రేలో పెట్టడానికి నిరాకరించారట కంగనా. అంతే కాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించారట. దీంతో ఆగ్రహానికి గురయిన ఒక మహిళా సెక్యూరిటీ అధికారి (CISF జవాన్) కంగనాపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. తను పంజాబ్ కపూర్తలాలోని సుల్తాన్‌పూర్ లోధికి చెందిన అధికారిగా తెలుస్తోంది. అంతే కాకుండా తను మాజీ పొలిటీషియన్ షేర్ సింగ్ మల్హివాల్ సోదరి అని కూడా సమాచారం. ఈ విషయం కొద్ది గంటల్లోనే వైరల్ అవ్వడంతో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి కంగనా ముందుకొచ్చింది.


బాగానే ఉన్నాను..


‘‘నాకు మీడియా నుంచి, తెలిసిన వారి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముందుగా నేను సేఫ్‌గానే ఉన్నానని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈరోజు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్ దగ్గర ఒక సంఘటన జరిగింది. నేను సెక్యూరిటీ చెక్ నుంచి బయటికి రాగానే ఒక సీఐఎస్ఎఫ్ స్టాఫ్ నా పక్కకు వచ్చి నన్ను తిడుతూ నాపై చేయి చేసుకుంది. తను ఎందుకలా చేసిందని అడగగా.. తాను రైతుల నిరసనను సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది. నేను జాగ్రత్తగానే ఉన్నాను కానీ పంజాబ్‌లో పెరుగుతున్న టెర్రరిజం అనేది నన్ను కలవరపెడుతోంది’’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు కంగనా రనౌత్.






ఘన విజయం..


హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేశారు కంగనా రనౌత్. అక్కడ తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ లీడర్ విక్రమాదిత్య సింగ్‌ను 74,755 ఓట్ల మెజారిటీతో ఓడించారు. తనకు పూర్తిగా 5,37,022 ఓట్లు పడ్డాయి. దీంతో ఎంపీగా గెలిచినందుకు ఆ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకున్నారు కంగనా రనౌత్. తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు. కానీ ఎంపీగా మారిన మొదటిరోజే కంగనాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: నటి, ఎంపీ కంగనా రనౌత్‌‌కు చేదు అనుభవం - చెంప చెళ్లుమనిపించిన సీఐఎస్ఎఫ్ జవాన్