Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత సినిమా, రాజకీయ పరిస్థితులపై ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీకు కేరాఫ్ గా నిలుస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల బాలీవుడ్ లో ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమా విడుదల అయింది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించారు. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోతుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఈ మూవీ దర్శకుడు కరణ్ జోహార్ ను విమర్శిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ లు చేసింది. దీంతో ఇప్పుడు కంగనా వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.
కరణ్ జోహార్ పై ఫైర్ అయిన కంగనా..
‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమా జులై 28 న విడుదల అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను సొంతం చేేసుకుంది. దీంతో ఈ మూవీకు తొలి రోజు రూ.11 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ మూవీపై విమర్శలు మొదలైయ్యాయి. రీసెంట్ గా ఓ మూవీ క్రిటిక్ ఈ మూవీపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీన్ని కంగనా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది. అంతేకాదు ఓ పెద్ద నోట్ ను కూడా రాస్తూ కరణ్ జోహార్ పై విమర్శలు గుప్పించింది.
జనాలేమీ పిచ్చోళ్లు కాదు: కంగనా రనౌత్
సోషల్ మీడియా వేదికగా కరణ్ జోహార్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయింది కంగనా. ఇలాంటి సినిమాలు చూడటానికి జనాలు ఏమీ పిచ్చోళ్లు కాదని పేర్కొంది. ఇలాంటి చెత్త సినిమాలను ప్రేక్షకులు సపోర్ట్ చేయరని చెప్పింది. అసలు ఈ సినిమాలో కాస్ట్యూమ్స్, సెట్స్ అన్నీ నకిలీవేనని ఆరోపించింది. కరణ్ జోహార్ తొంభైళ్లో వచ్చిన తన సినిమాల నుంచే కాపీ కొట్టి ఇందులో పెట్టారని వ్యాఖ్యానించింది. ఇలా తన సినిమాలు తనే కాపీ కొట్టడానికి సిగ్గుగా అనిపించడంలేదా అని ప్రశ్నించింది. సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు అవసరమా అని దుయ్యబట్టింది. బయట టాలెంట్ ఉన్న చాలా మంది టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారని, అలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చి కరణ్ రిటైర్ అవ్వాలని సూచించింది. అవనసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దని, ఇండస్ట్రీకి ఇది సరైన సమయం కాదని అంది.
దక్షిణాది హీరోలను చూసి రణ్ వీర్ నేర్చుకోవాలి: కంగనా
కరణ్ జోహార్ తో పాటు హీరో రణ్ వీర్ సింగ్ కు కూడా సలహాలిచ్చింది కంగనా.
కరణ్ జోహార్ బాటలో నడవొద్దని రణ్ వీర్ కు సూచించింది. కరణ్ లా మారొద్దని ధర్మేంద్ర, వినోద్ ఖన్నా లాంటి సీనియర్ స్టార్స్ లా మంచి బట్టలు వేసుకోవాలని వ్యాఖ్యానించింది. అలాగే సౌత్ హీరోలు ఎలా ఉంటారో కనీసం వాళ్లని చూసైనా నేర్చుకోవాలంటూ చురకలంటించింది. వేషధారణతో మ న సంస్కృతిని నాశనం చేయొద్దు అంటూ హితవు పలికింది కంగనా. కంగనా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే నెపోటిజం గురించి కూడా కంగనా పలు వ్యాఖ్యలు చేసింది. గతం నుంచీ కూడా కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ వంటి స్టార్స్ ని కంగనా వ్యతిరేకిస్తూ వస్తోంది. వీళ్లంతా ఒక మాఫియాగా టాలెంట్ ఉన్న కొత్త వాళ్లను తొక్కేస్తున్నారని ఆమె ప్రధాన ఆరోపణ. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం నేపోటిజం కి వ్యతిరేకంగా కంగనా మరింత ఎక్కువగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి కంగనా వ్యాఖ్యలపై కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: రజనీకాంత్‌ను ఎగతాళి చేస్తావా? నువ్వెందుకు సూపర్ స్టార్ కాలేదురా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial