బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాటలకు అసలు ఫిల్టర్స్ ఏమీ ఉండవు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటుంది. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉంటుంది. తాజాగా 40,50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారి అందాన్ని ఎవరూ పట్టించుకోరు అంటూ మరోసారి కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది కంగనా రనౌత్.


ఐశ్వర్య రాయ్‌పై కంగనా పోస్ట్..
బాలీవుడ్‌లో క్వీన్‌గా వెలిగిపోతూ కూడా అక్కడవారు చేసే కొన్ని పనులు తనకు నచ్చవంటూ పలుమార్లు వారి మొహం మీదే చెప్పేసింది కంగనా. ఈసారి కూడా బాలీవుడ్ సాంగ్ రైటర్స్ అనేవారు కేవలం యువతుల అందాల గురించి మాత్రమే పాటలు రాస్తున్నారని, 40, 50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారు ఎంత అందంగా ఉంటారో చెప్పడం లేదని కంగనా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన మాటను సమర్థించుకోవడానికి మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రం నుండి ఐశ్వర్య రాయ్‌ క్లిప్ ఒకటి షేర్ చేసింది కూడా. ఇందులో ఐశ్వర్య రాయ్ చాలా అందంగా, అసలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది.


అందంతో పాటు అనుభవం..
మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ఫ్రాంచైజ్ ఒక క్లాసిక్‌లాగా నిలిచింది. ఇందులో హీరోల పాత్రల కంటే హీరోయిన్స్ పాత్రలకే ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యాన్స్ అయ్యారు. కుందవైగా నటించిన త్రిషకు, నందినిగా నటించిన ఐశ్వర్ రాయ్‌కు సమానంగా గుర్తింపు లభించింది. అయితే ‘పొన్నియిల్ సెల్వన్ 1’లో కుందవైను నందిని కలిసే సీన్‌ను కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘బాలీవుడ్ లిరిసిస్ట్స్ 17 ఏళ్ల అమ్మాయిల గురించి చాలానే రాశారు. కానీ 40, 50 ఏళ్లు ఉన్న ఆడవారిలోని శృంగార భావం గురించి, వారిలో ఉండే ఆ మత్తు, మెరుపు గురించి రాయడంలో ఫెయిల్ అయ్యారు. వారు కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు.. స్మార్ట్‌గా, అనుభవంతో కూడా ఉంటారు. రెండు అందమైన చందమామలు’ అంటూ తను షేర్ చేసిన వీడియో గురించి రాసుకొచ్చింది కంగనా.


కంగనా ఇలా అనడమేంటి..?
మామూలుగా బాలీవుడ్‌లోని ఏ ఒక్క నటుడితో కానీ, నటితో కానీ కంగనాకు సన్నిహిత సంబంధాలు లేవు. ఎవరిలో ఏ క్వాలిటీ నచ్చకపోయినా కంగనా మొహం మీదే చెప్పేయడంతో తను ఎక్కువగా స్నేహితులను సంపాదించుకోలేకపోయింది. అలాంటి సడెన్‌గా కంగనా.. ఐశ్వర్య వీడియో షేర్ చేయడమేంటి? తన అందం గురించి ప్రశంసించడమేంటి? తనను చందమామ అని పిలవడమేంటి? అని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ కంగనా చెప్పినదాంట్లో కూడా పాయింట్ ఉందని మరికొందరు అంటున్నారు. 40, 50 ఏళ్లు వచ్చిన ఆడవారిలో కూడా అందం ఉట్టుపడుతుందంటూ కంగనా కామెంట్స్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా కంగనా ఏం చెప్పినా కరెక్ట్‌గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.


Also Read: హాలీవుడ్ హీరోకు డిమెన్షియా వ్యాధి ‘నేను అస్సలు బాలేను’ అంటూ వీడియో షేర్ చేసిన నటుడి భార్య


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial