స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఫ్యామిలీ గురించి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు వివాహమై సుమారు 13 ఏళ్ళు. తెలుగు ప్రేక్షకులకూ, బుల్లితెర వీక్షకులకూ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ తెలుసు. భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 


శశాంక్, అనసూయ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ. అటువంటి కుటుంబంలో కలతలు వచ్చాయా? అనసూయ భరద్వాజ్ విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారా? ఇప్పుడు కొందరిలో ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె చేసిన ఓ పోస్ట్. ఆవిడ చెప్పిన మాటలు ఎంత మాత్రం ఈ సందేహాలకు కారణం కాదు. తాను విడాకుల గురించి ఆలోచన చేస్తున్నట్లు కూడా అనసూయ ఎక్కడా చెప్పలేదు. అయితే... అసలు విషయం దాచి పెట్టడంతో విడాకులు కూడా కావచ్చని ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు తీస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... 


విడాకులు తీసుకుంటున్నారా? ఏంటి?
ఆగస్టు 19... శనివారం సాయంత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో నెగిటివిటీని తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారని భావించారంతా! అలాగని, ఆవిడ చెప్పలేదు కానీ... ప్రజల ముందుకు సోషల్ మీడియాను తీసుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు అలా ఉందా? అంటూ ఆవిడ ప్రశ్నించడంతో ట్రోలింగ్ అని జనాలు భావించారు. నెగిటివిటీని చూసి ఫీల్ అవ్వనని, కోప్పడతానని అనసూయ మరో వీడియో విడుదల చేశారు.


 ''అరే ఏంట్రా మీరంతా?'' అంటూ అనసూయ కొత్త వీడియో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అనసూయ అటెన్షన్ కోసం అలా చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అనసూయను ధైర్యంగా చెబుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం 'డివోర్స్ తీసుకుంటున్నారా ఏంటి మా' అని కామెంట్ చేశారు.


Also Read : ప్రతి పండక్కి, ప్రతి నెలలో శ్రీ లీల సినిమా... వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు




అనసూయ ఓవర్ యాక్షన్... కమల్ హాసన్! అనసూయ కొత్త వీడియో కింద కామెంట్ సెక్షన్ చూస్తే... ఓవర్ యాక్టింగ్ చేస్తుందని చాలా మంది కామెంట్స్ చేశారు. 'అట్టా కమల్ హాసన్' అంటూ కొందరు వెటకారం చేశారు. 


అటెన్షన్... అటెన్షన్... అంటూ వస్తున్న కామెంట్స్ పట్ల కూడా అనసూయ రియాక్ట్ అయ్యారు. ''ఏంటి మీరు అటెన్షన్ అటెన్షన్ అని పాపం! మనం ఈ సామాజిక మాధ్యమాల్లో ఉన్నది అటెన్షన్ కోసమే! నేను అంగీకరిస్తున్నాను. మీకెందుకు ముసుగులో గుద్దులాటలు. నాకు అటెన్షన్ కావాలి. నేను చెప్పాలి అనుకున్నది కన్వే చేయడానికి'' అని అనసూయ ట్వీట్ చేశారు. 


Also Read ఝలక్ ఇచ్చిన అనసూయ - సోషల్ మీడియా నెగిటివిటీకి కాదు, ఏడ్చింది అందుకేనట!



ఇంగ్లీష్... తెలుగు... ఏ భాషలో మాట్లాడాలి?
అనసూయ విడుదల చేసిన వీడియోలో ఆమె కొంత ఇంగ్లీష్, మరికొంత తెలుగులో మాట్లాడుతూ కనిపించారు. అంతకు ముందు చేసిన పోస్ట్ కూడా ఇంగ్లీష్ భాషలో ఉంది. దాంతో కొందరు తమది తెలుగు మీడియం అని, పోస్ట్ చేసినది అర్థం కాలేదని కామెంట్ చేశారు. ఇంకొందరు 'మేడమ్! నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఇంగ్లీష్ లో మాట్లాడండి' అని కామెంట్ చేశారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial