'బిగ్ బాస్ 5' విజేత, యువ కథానాయకుడు వీజే సన్నీ (VJ Sunny) నటిస్తున్న కొత్త సినిమా 'సౌండ్ పార్టీ' (Sound Party Movie Telugu). హ్రితిక శ్రీనివాస్ కథానాయిక. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయ శంకర్ చిత్ర సమర్పకులు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదలైంది. 


బస్తీ టు బంజారా హిల్స్... హీరో టార్గెట్ అదే!
'సౌండ్ పార్టీ' టీజర్ ద్వారా కథ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో శివన్నారాయణ, సన్నీ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఓ బస్తీలో అద్దె ఇంటిలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆ స్థాయి నుంచి బంజారా హిల్స్‌లో ఇంటిని అద్దెకు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటారు. దానికి చేరుకునే క్రమంలో వాళ్ళిద్దరూ ఎందుకు జైలుకు వెళ్లారు? సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని ఎందుకు హీరో వదులుకున్నాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి. 


'సౌండ్ పార్టీ' అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా 'సమాజం ఏమైనా ఊరికే ముందుకు పోతుందా? మా మందు బాబులు ముందుకు నెడితే పోతుంది' అని శివన్నారాయణ చెప్పిన డైలాగ్ వింటే... సినిమా జానర్ అర్థం అవుతుంది. 


Also Read : ఝలక్ ఇచ్చిన అనసూయ - సోషల్ మీడియా నెగిటివిటీకి కాదు, ఏడ్చింది అందుకేనట!



టీజర్ విడుదల చేసిన తర్వాత సంప‌త్  నంది మాట్లాడుతూ ''నేను గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించా. ఇప్పుడు అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నాడు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. 'సౌండ్ పార్టీ' టీజ‌ర్ బావుంది. మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. 'జాతి ర‌త్నాలు' సినిమాలా ఈ 'సౌండ్ పార్టీ' ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది. అంద‌రూ చేతిలో సెల్ ఫోన్, సిగ‌రెట్ ప‌ట్టుకుని తిరుగుతుంటారు. జ‌య‌శంక‌ర్ మాత్రం పుస్త‌కం ప‌ట్టుకుని తిరుగుతుంటాడు. అతనిలో ఆ లక్షణం నచ్చే 'పేప‌ర్ బాయ్'కి దర్శకుడిగా అవ‌కాశం ఇచ్చా'' అని చెప్పారు. 


సెప్టెంబర్ (Sound Party Movie Release)లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన రవి పోలిశెట్టి తెలిపారు. టీజర్ విడుదల చేసిన సంపత్ నందికి థాంక్స్ చెప్పారు. జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ... ''మా హీరో వీజే స‌న్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంప‌త్ నంది గారు 'సౌండ్ పార్టీ' టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నేను ఇండ‌స్ట్రీలో ఇలా ఉన్నానంటే కార‌ణం సంప‌త్ నంది గారు. దర్శకుడిగా నాకు తొలి అవకాశాన్ని ఆయన ఇచ్చారు. మ‌నతో మొద‌టి నుండి ప్రయాణం చేసేవాళ్ల‌కు, మ‌న‌కు తోడుగా ఉండేవాళ్ల‌కు మ‌నం మద్దతు ఇవ్వాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే, నేను దర్శకత్వం చేయాల్సిన సినిమాను త‌మ్ముడు సంజ‌య్ శేరితో చేయించా. సంజ‌య్ కొత్త త‌ర‌హా కామెడీ పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాను ఆద‌రిస్తే ఒక జంధ్యాల‌, ఈవీవీ గారి త‌ర‌హా చిత్రాలు సంజ‌య్ నుంచి చాలా వ‌స్తాయి'' అని చెప్పారు. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశామని సన్నీ తెలిపారు. 


Also Read 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?



'సౌండ్ పార్టీ' సినిమాలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, అంజలి, ఇంటూరి వాసు, 'చలాకి' చంటి, ప్రేమ్ సాగర్, ఆర్జే హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రానికి కూర్పు : జి. అవినాష్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, పాటలు : పూర్ణ చారి, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ రెడ్డి, సంగీతం : మోహిత్ రెహమానిక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : భువన్ సాలూరు, నిర్మాతలు : రవి పోలిశెట్టి - మహేంద్ర గజేంద్ర - శ్రీ శ్యామ్ గజేంద్ర, సమర్పణ : జ‌య‌శంక‌ర్‌, రచన - ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial