Kangana Ranaut about Animal: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు ఏ విషయం నచ్చకపోయినా సూటిగా చెప్పేస్తుందనే పేరు ఉంది. ఆ అలవాటు వల్లే ఇప్పటికీ ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దిగ్గజాలపై పలుమార్లు ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది కంగనా. అంతే కాకుండా తనకు నచ్చిన సినిమాలను కూడా ఖండిస్తూ పోస్టులు పెట్టడం కంగనా ఏ మాత్రం వెనకాడదు. తాజాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టింది కంగనా రనౌత్. అంతే కాకుండా తన సినిమాలను జరుగుతున్న అన్యాయం గురించి మరొకసారి చెప్పుకొచ్చింది.
ఆడియన్సే కారణం..
సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ రివ్యూలు వచ్చాయో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. సందీప్ కావాలనే తన సినిమాల్లో ఆడవారిని హింసిస్తూ చూపిస్తాడని, తన డైలాగులు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఇలా చాలామంది ప్రేక్షకులు ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీ విడుదలయ్యి ఇన్ని రోజులు అయినా కంగనా మాత్రం దీనిపై స్పందిచంలేదు. తాజాగా ‘యానిమల్’ను చూసిన కంగనా.. తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా బయటపెట్టింది. సినిమాల్లో హింసను చూపించడానికి కారణం ఆడియన్సే అని ఆరోపించింది.
‘యానిమల్’పై కంగనా ఇన్‌డైరెక్ట్ కౌంటర్..
‘‘నా సినిమాలకు పెయిడ్ నెగిటివిటీని అందించడమే పెద్ద విషయం అని భావిస్తుంటే.. ఆడవారిని కొట్టి, హింసించి, వారిని సె* ఆబ్జెక్ట్స్‌లాగా భావించి, వారితో షూ నాకమని అడిగే సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించడం మరో ఎత్తు. రానున్న రోజుల్లో కెరీర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది’ అంటూ ‘యానిమల్’ టైటిల్‌ను బయటపెట్టకపోయినా.. ఆ సినిమాను ప్రోత్సహించిన ప్రేక్షకులను తప్పుబట్టింది కంగనా. దీంతో పాటు తను నటించిన ‘తేజస్’ సినిమాకు పలువురు ఇచ్చిన నెగిటివ్ రివ్యూలను కూడా షేర్ చేసింది.
వారందరికీ నో చెప్పాను..
‘సినిమాల్లో ఆడవారిని గోడపై బొమ్మలాగా చూపించే స్థాయికి ట్రెండ్ దిగజారింది. కొంచెం కూడా గౌరవం అనేది లేకుండా ఆడవారిని బట్టలు విప్పించడం చూస్తుంటే నేను సినిమాల్లోకి అడుగుపెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో హీరోయిన్స్‌కు ఐటెమ్ పాటలు, వచ్చి వెళ్లిపోయే పాత్రలు మాత్రమే ఉండేవి. చాలా సంవత్సరాలు ఈ విషయంపై పోరాడి గ్యాంగ్‌స్టర్, ఫ్యాషన్, వో లమ్హే, క్వీన్, మణికర్ణిక, తలైవీ, తేజస్ లాంటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కున్నాను. వైఆర్ఎఫ్, ధర్మ ఫిల్మ్స్ లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లకు నో చెప్పాను. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలకు నో చెప్పాను. అది వారిపై నాకు ఉన్న ద్వేషంతో కాదు. కేవలం మహిళా సాధికారత కోసమే. ఈరోజుల్లో సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు చూస్తుంటే నేనెందుకు ఇంత కష్టపడ్డానా అనిపిస్తుంది. అది మన సినీ పరిశ్రమకే సిగ్గుచేటు. ఈ పరిస్థితికి ప్రేక్షకులే బాధ్యత వహించాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్.
Also Read: 'కేజీఎఫ్' హీరో యశ్ బర్త్ డే వేడుకల్లో అపశృతి - ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం