లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'విక్రమ్'. తమిళ, తెలుగు భాషల్లో జూన్ 3న విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా కమల్ హాసన్‌ను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 400లకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్టు సమాచారం.


అతిథి పాత్రలో తమిళ స్టార్ సూర్య
తమిళ హీరో విజయ్ సేతుపతి, మలయాళ హీరో - 'పుష్ప: ద రైజ్' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటించారు. ప్రతి ఒక్కరి పాత్ర చాలా స్పెషల్ అన్నట్టు ఉంటుందట.


Also Read: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?






బేసిక్ ఐడియా కమల్ హాసన్‌దే!
ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు. 'ఖైదీ', 'మాస్టర్' సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీనినీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.


Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?