'రాశి... అందాల రాశి' అంటూ జూన్ 1న గోపీచంద్, రాశీ ఖన్నా జోడీ కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'బన్నీ' వాసు నిర్మాత. సినిమాలో రెండో పాట 'అందాల రాశి'ని జూన్ 1న విడుదల చేయనున్నట్టు నేడు వెల్లడించారు. హీరోయిన్ రాశీ ఖన్నా పేరు వచ్చేలా ఈ పాట రాయడం విశేషం.
జూలై 1న 'పక్కా కమర్షియల్' విడుదల
కామెడీ అండ్ యాక్షన్ మేళవించిన లాయర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్న చిత్రమిది. ఇందులో ఆయనకు జంటగా కనిపించనున్న రాశీ ఖన్నాది సైతం లాయర్ రోల్. జూలై 1న సినిమా విడుదల కానుంది. 'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న చిత్రమిది.
Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
టైటిల్ సాంగ్ రాసిన 'సిరివెన్నెల'
'పక్కా కమర్షియల్' సినిమా టైటిల్ సాంగ్ దివంగత గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారు. 'జన్మించినా... మరణించినా... ఖర్చే ఖర్చు... పక్కా కమర్షియల్' అంటూ సాగిన ఆ గీతం కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యింది. జేక్స్ బిజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read: మాస్ మహారాజ రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్, 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ విడుదల వాయిదా