RamaRao On Duty Movie Update: మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్టు మార్చిలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. విడుదల వాయిదా పడినట్టు ఈ రోజు వెల్లడించారు. 


''రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల జూన్ 17న విడుదల కావడం లేదు. బెస్ట్ అండ్ మాస్ అవుట్ పుట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త విడుదల తేదీ (RamaRao On Duty Movie New Release Date) త్వరలో వెల్లడిస్తాం'' అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది.






రవితేజకు జోడీగా ఇద్దరమ్మాయిలు
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో శరత్ మండవ తెలుగు చలన చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన 'బుల్ బుల్ తరంగ్' శ్రోతలను ఆకట్టుకుంది. 'సొట్ట బుగ్గల్లో...' పాటకూ మంచి స్పందన లభిస్తోంది.  


వాయిదా పడటం రెండోసారి
'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ రోజు 'ఆర్ఆర్ఆర్' రావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత జూన్ 17 అనుకున్నారు. ఇప్పుడు ఆ రోజున కూడా సినిమా రావడం లేదు.


Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?


యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'రామారావు ఆన్ డ్యూటీ' తెరకెక్కుతోంది. ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్‌: ప్రవీణ్ కేఎల్, సంగీతం: సామ్ సీఎస్.


Also Read: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?