పంకజ్ శ్రీరంగం హీరోగా, దేవి శ్రీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సముద్రం చిట్టబ్బాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇదో చక్కని విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. వైజాగ్, తుని మధ్యలో గల బొడ్డవరంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా, ఎన్నో ఎమోషన్స్‌ను తెరపై చూడవచ్చు. కుటుంబం, స్నేహితుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు కట్టిపడేసే సీన్స్ ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో దాదాపు అందరూ నూతన నటీనటులే. కాబట్టి, ఈ చిత్రం మీకు ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. 


దర్శకుడు మిర్యాల శివకు ఇది తొలి చిత్రం. హీరో పంకజ్ శ్రీరంగం మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు వివిధ సినిమాల్లో చిన్న పాత్రలను చేసిన పంకజ్ హీరోగా తన ప్రతిభను చూపేందుకు సిద్ధమవుతున్నాడు. పంకజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న దేవి శ్రీ కూడా పలు సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలు, చెల్లి పాత్రల్లో నటించింది. హీరోయిన్‌గా నటించడం ఇదే తొలిసారి. వృత్తిరీత్యా దంత వైద్యుడైన డాక్టర్ ఫణి కుమార్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారు. సాయి గాయత్రి తనయ్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిజానీ అంజన్ సంగీతం అందిస్తున్నారు. రాజారాం దిల్లీ, శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. 


Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!



Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడు? 


Also Read: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం స్పందన ఏమిటీ?