‘బంగార్రాజు’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీతో వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం ‘థాంక్యూ’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చైతూ భిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు చైతూ సరసన నటిస్తున్న ఈ చిత్రం జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ‘100% లవ్’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’, ‘ప్రేమమ్’ చిత్రాలు గుర్తుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ సినిమాల తరహాలోనే ఇందులో కూడా టీనేజ్ నుంచి పెద్ద వయస్సు వరకు జీవితంలో ఎదురయ్యే చేదు, తీపి అనుభవాలతో ‘థాంక్యూ’ సినిమా సాగుతుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
‘‘నా సక్సెస్‌కు నేనే కారణం’’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘‘లైఫ్ లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను’’, ‘‘నన్ను నేను సరిచేసుకోడానికి.. నేను చేస్తున్న ప్రయాణమే ఇది’’ అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించాడు చైతూ. అలా అవికా, మాళవిక, రాశీలతో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తున్నాయి. ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందించాడు. రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Thank You Movie Teaser:
Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడు?