Kalki 2898 AD Mandapam, Ashwathama Ganesh Idol In Tamilnadu Viral : వినాయక చవితి పండగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. గల్లీ గల్లీకో గణనాథుడు కొలువు తీరుతాడు. బజారుకో మండపం వెలుస్తుంది. ఇక ఒకరిని మించి ఒకరు గొప్పగా మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. అలా ఏటా సినిమా సెట్స్ ని తలపించే మండపాలు వెలుస్తుంటాయి. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా, ఆ సీజన్ లో హిట్ అయిన సినిమాల సెట్స్ ను, సినిమాల్లోని క్యారెక్టర్లతో బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు చాలా చోట్ల. గతంలో 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు సంబంధించి గణపతి బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది స్పెషల్ 'కల్కీ 2898 ఏడీ' వినాయకుడు. మరి ఏంటా మండపం స్పెషల్? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఒక లుక్కేద్దాం.
అశ్వత్థామగా వినాయకుడు.. బుజ్జి కూడా
తమిళనాడులో 'కల్కీ 2898 ఏడీ ' సెట్ తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణగిరి జిల్లాలోని డెంకని కోట్టైనిలో దీన్ని ఏర్పాటు చేశారు. అశ్వత్థామ వినాయకుడిని ప్రతిష్టించారు. చేతులో ఆయుధాలను పట్టుకుని అశ్వత్థామగా కనిపించాడు గణనాథుడు. ఇక కల్కీ సినిమాలో ఉన్న కాంప్లెక్స్ ని వినాయకుడి మండపంగా తీర్చిదిద్దారు. దాంతో పాటుగా బుజ్జిని కూడా ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ లో ఉండే యాస్కిన్ ని కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ మండపానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్నారు. పిల్లలు అయితే బుజ్జిని చూసేందుకు ఎగబడుతున్నారు. బుజ్జితో ఫొటోలు తీసుకుంటూ సంబరపడిపోతున్నారు.
'పుష్ప - 2' వినాయకుడు..
ఇక ఇదిలా ఉంటే.. పోయిన ఏడాది చాలా మండపాల్లో పుష్ప వినాయకుడు బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఇక ఈసారి కూడా 'పుష్ప - 2' గణనాథులు దర్శనం ఇచ్చారు. 'పుష్ప -2'లో వైరల్ అవుతన్న హుక్ స్టెప్ వేస్తున్నట్లుగా గణనాథుని బొమ్మను తయారు చేశారు. దీంతో ఆ బొమ్మపై విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా రకరకాల గణపతి బొమ్మలను ఏర్పాటు చేశారు. చాలా వినాయకుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. చాక్లెట్ వినాయకుడు, బెల్లం వినాయకుడ లాంటివి కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలా వెరైటీల వినాయకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్..
ఇటీవల రిలీజైన 'కల్కీ 2898 ఏడి' సినిమాలో అశ్వత్థామగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన ఫైట్స్, పర్సనాలిటీ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏజ్ లో కూడా అమితాబ్ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు దక్కాయి కూడా. నాగ్ అశ్విన్ కల్కీ కి డైరెక్టర్ కాగా.. ఆ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్కీ పార్ట్ - 2 రాబోతున్న విషయం తెలిసిందే.
Also Read: తెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?