పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్ లో స్టార్ డమ్ కోసం సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది. అదితి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా ఓ కొత్త తెలుగు సినిమాకోసం అదితిని నిర్మాతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆమె టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నారని సమాచారం. శంకర్ డైరక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ లో అదితి ఓ గెస్ట్ రోల్ చేశారని టాక్. ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకంగా ఉంటుందా? లేదంటే కూతురి కోసం శంకర్ ఓ పాత్రను సృష్టించారా?అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. 


దర్శకుల వారసులు ఇండస్ట్రీలో సకెస్స్ అయిన సందర్భాలు అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ గా తనని తాను నిరూపించుకోడానికి అదితి కూడా సిన్సియర్ గా ట్రై చేస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితికి డైరక్షన్ ఫీల్డ్ పై ఇంట్రస్ట్ ఏమాత్రం లేదు. ఆమె హీరోయిన్ గా కోలీవుడ్ లో ఆఫర్లు పట్టేశారు. హీరో కార్తి నటించిన 'విరుమన్' ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ కార్తికేయన్‌ 'మావీరన్‌'లోనూ ఆమె నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆకాష్ మురళి హీరోగా చేస్తున్న 'నేసిప్పాయా' అనే సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ తర్వాత అర్జున్ దాస్ తో జోడీ కట్టేందుకు కాల్షీట్లిచ్చారు. దర్శకత్వం వైపు రావాలని ఓ దశలో తండ్రి ఆమెను ప్రోత్సహించినా, ఆమె మాత్రం హీరోయిన్ గా తన టాలెంట్ చూపిస్తానంటోంది. 


డాక్టర్ కోర్స్ చదువుతూనే సినిమాలపై దృష్టిపెట్టారు అదితి. ఆమెకు తెలుగు కూడా బాగా వచ్చు. అందుకే ఆమె టాలీవుడ్ వైపు చూస్తున్నారు. అయితే కోలీవుడ్ లో క్రేజ్ వచ్చాకే ఆమె టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవ్వడం విశేషం. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత కనపడుతోంది. ఉన్నవారినే రిపీట్ చేస్తున్నారు దర్శకులు. అడపా దడపా మిస్టర్ బచ్చన్ వంటి సినిమాల్లో భాగ్యశ్రీ లాంటి కొత్త ఫేస్ లను దర్శకులు పరిచయం చేస్తున్నా సక్సెస్ రేట్ ని బట్టే ఇక్కడ అవకాశాలు లభిస్తుంటాయి. తండ్రి శంకర్ మంచి పేరున్న దర్శకుడు అయినా కూడా హీరోయిన్ గా అదితి సక్సెస్ అందుకోగలిగితే అవకాశాలు వస్తాయి. లేకపోతే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు అని చెప్పుకోవాల్సిందే.


Also Read: ‘గోట్‘ ఓటీటీ రిలీజ్... మూడు గంటలు కాదు, అంతకు మించి - రన్‌ టైమ్ పెంచుతున్న వెంకట్ ప్రభు


అదితి తెలుగు సినిమా ఆఫర్ పై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఆమె కచ్చితంగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తారని మాత్రం తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ దాదాపు ఖాయమేనంటున్నారు. తండ్రి శంకర్ కి ఉన్న పాపులార్టీతో అదితికి అవకాశాలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆమె టాలెంట్ తో వాటిని సక్సెస్ లు గా మలచుకున్నప్పుడే హీరోయిన్ గా పేరు తెచ్చుకోగలదు. టాలీవుడ్ లో హీరోయిన్ ఎంట్రీకంటే ముందు గేమ్ ఛేంజర్ లో ఆమె కనిపిస్తే మాత్రం ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. రామ్ చరణ్ నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ మూవీకోసం ఎదురు చూస్తున్నారు. అయితే శంకర్ క్రేజ్ ఇటీవల కాస్త డౌన్ అయింది. భారతీయుడు-2 తర్వాత ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని ఆయన కూడా తాపత్రయ పడుతున్నారు. శంకర్ ఆశలను గేమ్ ఛేంజర్ మూవీ ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి. 


Also Read: హ‌ర్ర‌ర్ సినిమాలు అంటే ఇష్ట‌మా? నెట్ ఫ్లిక్స్ లోని టాప్ 10 హ‌ర్ర‌ర్ సినిమాలు మీ కోసం